దక్షిణాది చిత్ర పరిశ్రమలో కమల్ హాసన్ గురుంచి తెలియనివారుండరనే చెప్పాలి. చిత్ర పరిశ్రమలో లోక నాయకుడిగా పేరు గాంచి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. పాత్ర ఏదైనా నటనతోనే సమాధానం చెప్పగల ధీరుడు మన కమల్ హాసన్. నటుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు.
తన యాక్టింగ్ తో ప్రేక్షకులతో చప్పట్లతో పాటు కన్నీళ్లను కూడా రాబట్ట గల నటుడు మన లోకనాయకుడు. వయస్సు మీద పడుతున్నా..తన నటనలో ఎక్కడకూడా మెట్టు దిగటం లేదంటే ఆయనేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక విషయం ఏంటంటే..టైటిల్ లో మీరు చదివినట్లుగా కమల్ హాసన్ నిజంగానే అంధుడు అయ్యాడా..? అవ్వబోతున్నాడా ? అసలు ఏంటి కథ అనేది తెలుసుకుందాం.
ఖైదీ, మాస్టర్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనకరాజ్. ఇక ఆయన దర్శకత్వంలో కమల్ త్వరలో ఓ సినిమా చేయనున్నాడు. వీరిద్దరి కలయికలో ఎప్పటి నుంచో ఓ సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి. ఇక ఇందులో కమల్ హాసన్ అంధుడి పాత్రలో కనిపించనున్నాడట. ఎందరో గొప్ప గొప్ప నటులు నటించబోతున్న ఈ సినిమాలో కమల్ కళ్ళు లేనటువంటి లేనటువంటి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. కమల్ హాసన్ గతంలో తమిళంలో విడుదలైన రాజా పార్వై అనే చిత్రంలో కళ్ళు లేని వాడిగా నటించి మంచి మార్కులు కొట్టేసాడు. ఇక మరోమారు అలాంటి పాత్రలో తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడు కమల్. ఇక ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.