సెలబ్రిటీలకు సంబంధించి ఏవైనా కొత్త విషయాలు తెలిశాయంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అటెన్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది. తమ ఫేవరేట్ స్టార్ గురించి కొత్తగా ఏ విషయం బయటికి వచ్చిందోనని తెలుసుకునే ఆరాటం ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. కానీ.. అన్నిసార్లు కొత్త విషయాలే కాదు.. కొన్నిసార్లు ఫేవరేట్ స్టార్స్ వి ఓల్డ్ మెమోరీస్ కూడా మనసులకు బాగా దగ్గరవుతాయి. అలాంటి విషయాలలో చిన్ననాటి ఫోటోలు కూడా ఉంటాయి.
సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏవైనా కొత్త విషయాలు తెలిశాయంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ అటెన్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది. తమ ఫేవరేట్ స్టార్ గురించి కొత్తగా ఏ విషయం బయటికి వచ్చిందోనని తెలుసుకునే ఆరాటం ఫ్యాన్స్ లో కనిపిస్తుంది. కానీ.. అన్నిసార్లు కొత్త విషయాలే కాదు.. కొన్నిసార్లు ఫేవరేట్ స్టార్స్ వి ఓల్డ్ మెమోరీస్ కూడా మనసులకు బాగా దగ్గరవుతాయి. ఎందుకంటే.. హీరోలైనా, హీరోయిన్స్ అయినా వారి గురించి ఫ్యాన్స్ కి తెలియని విషయాలు అనేవి రేర్ గానే బయట పడుతుంటాయి. అలాంటి విషయాలలో చిన్ననాటి ఫోటోలు కూడా ఉంటాయి. పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో కనిపెట్టారా?
చిన్నతనంలోనే నటన రంగంలో అడుగుపెట్టి.. ఆ తర్వాత పెరిగేకొద్దీ మ్యూజిక్ పై ఆసక్తి పెంచుకొని సింగర్ గా మారింది. తనలోని మ్యూజిక్ టాలెంట్ ని బయటపెట్టే క్రమంలో హీరోయిన్ గా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలోకి వచ్చేసింది. హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కొద్దిరోజులకే టాలీవుడ్ లో స్టార్డమ్ సొంతం చేసుకొని.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అలా కెరీర్ పీక్స్ లోకి వెళ్తున్న టైంలో ఫారెన్ మ్యూజిషియన్ తో ప్రేమలో పడి సినిమాలకు దూరమైంది. పెళ్లి పీటల వరకు వెళ్ళాక.. ఈ భామ అతనితో బ్రేకప్ అయిపోయి.. మళ్లీ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఇంకేముంది సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది.
నేనెవరి గురించి చెబుతున్నానో ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అయినా అర్థం కాకపోతే ఇంకో క్లూ ఇస్తాను. ఈ బ్యూటీకి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అయినా సరే తనకంటూ స్పెషల్ రికగ్నిషన్ దక్కించుకుందని చెప్పాలి. ఇంకా దాచేదేముంది.. అర్థమైందిగా.. పైన ఫొటోలో చిన్నారి శృతిహాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ తనయగా ఇండస్ట్రీ కెరీర్ ప్రారంభించినప్పటికీ.. స్టార్ హీరోయిన్ గా ఎదిగి తన ఇమేజ్ తాను క్రియేట్ చేసుకోగలిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో క్రాక్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్స్ తో ఫుల్ ఫామ్ కంటిన్యూ చేస్తోంది. ఇక త్వరలోనే డార్లింగ్ ప్రభాస్ సరసన నటించిన ‘సలార్’ మూవీతో బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. మరి శృతిహాసన్ ముందునుండి అందగత్తె.. అయినా చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.