బోల్డ్ లుక్, హస్కీ వాయిస్, గ్లామర్‌తో రచ్చ చేసిన బ్యూటీ సిల్క్ స్మిత. 1980, 90 దశకంలో హీరోయిన్స్‌కు కూడా గట్టిపోటీనిచ్చింది ఆమె. తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నీంటిలోనూ, హిందీలోనూ నటించింది. ఆ తర్వాత ఆమె డౌన్ అయిపోయింది. హఠాత్తుగా బలవనర్మణానికి పాల్పడింది. అయితే ఆమెను కడసారి చూసేందుకు పరిశ్రమను నుండి ఎవ్వరూ వచ్చారంటే..?
సిల్క్ స్మిత. ఒకప్పటి అందాల తార. ఐటెం సాంగ్స్‌కు పెట్టిందీ పేరు. ఈమె సినిమాలో ఉందంటే, స్పెషల్ సాంగ్ చేసిందంటే పడుచువాళ్ల నుండి ముసలోళ్ల వరకు సినిమా థియేటర్లకు వెళ్లేవారంటే అతిశయోక్తి కాదు. బోల్డ్ లుక్, హస్కీ వాయిస్, గ్లామర్‌తో రచ్చ చేసిన బ్యూటీ. 1980-90 దశకంలో హీరోయిన్స్‌కు కూడా గట్టిపోటీనిచ్చింది ఆమె. తెలుగుతో పాటు దక్షిణాది భాషలన్నీంటిలోనూ, హిందీలోనూ నటించింది. కానీ ఒక్కసారిగా ఆమె గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. సినిమా అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అయితే ఆ సమయంలో ఆమె తీవ్ర నిర్ణయం తీసుకుంది. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.
మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత స్టార్ నటిగా ఎదిగింది సిల్క్ స్మిత. అతి చిన్న వయస్సులో ఆమె ప్రాణాలు బలి తీసుకుంది. సిల్క్ స్మిత చనిపోయిన నాటికి ఆమె వయస్సు కేవలం 35 ఏళ్లు మాత్రమే. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు అనేకం వినిపిస్తున్నప్పటికీ.. ఆమె ఎలా చనిపోయిందన్నదీ ఇప్పటికీ ఓ మిస్టరీనే. అయితే ఆమె చనిపోయినప్పుడు..ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్క స్టార్ కూడా రాలేదు. ఆమెకు అత్యంత సన్నిహితుడు రవిచంద్రన్ వెళ్లాడని అందరు అనుకుని ఉంటారు. కానీ ఆమె అంత్యక్రియలకు ఒకే ఒక్క స్టార్ నటుడు హాజరయ్యారు. ఆయనే యాక్షన్ కింగ్ అర్జున్.
అయితే ఆమె అంత్యక్రియలకు అర్జున్ రావడంపై అప్పట్లో చర్చగా మారిందట. సినీ పరిశ్రమ నుండి ఒక్కరే రావడంపై ఆయన ప్రశ్నించగా.. తామిద్దరం కలిసి ఓ సినిమాలో నటించిన సమయలో ‘నువ్వు నా నిజమైన స్నేహితుడివి అయితే నేను చనిపోయినప్పుడు చూడటానికి వస్తావా?’ అని అడిగిందట. అందుకు అర్జున్ అలా మాట్లాడకు అని కోప్పడినా.. ఆమె చనిపోయినప్పుడు ప్రత్యేకంగా వచ్చి నివాళులు అర్పించాడట. ప్రస్తుతం ఈ వార్తలో నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె నిజ జీవిత ఆధారంగా డర్టీ పిక్చర్ అనే సినిమా తీయగా.. పెద్ద హిట్ అయిన సంగతి విదితమే. సిల్మ్ స్మిత అనగానే మీకు గుర్తొచ్చే సినిమా ఏంటో కామెంట్స్ లో తెలపండి.