చిరంజీవితో ఉన్న ఈ వ్యక్తి ఇప్పుడొక స్టార్ డైరెక్టర్. సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీకి వచ్చారు. వెయ్యి రూపాయల జీతానికి పని చేశారు. ఆ వెయ్యి రూపాయలతో అప్పట్లో 3 నెలలు గడిపేవారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. చిరంజీవి, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. ఇతనిలో దర్శకుడ్ని చిరంజీవి, ప్రభాస్ గుర్తించి ప్రోత్సహించారు. వీరి ప్రోత్సాహంతో కాన్ఫిడెన్స్ ని నింపుకుని దర్శకుడిగా మారారు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. ఏ హీరో సినిమాకైతే అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారో.. అదే హీరోతో సినిమా చేసి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నారు. రీసెంట్ గా మాస్ బ్లాక్ బస్టర్ హిట్ కూడా అందుకున్నారు. అదేనండి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేనినే ఈ ఫోటోలో ఉన్నది.
ఆ ఫోటో స్టాలిన్ సినిమా సెట్స్ లోది. ఆ సినిమాకి మురుగదాస్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేస్తున్న టైం అది. అప్పుడే చిరంజీవి.. గోపీచంద్ మలినేనికి పుట్టినరోజు సందర్భంగా ఒక వాచ్ బహుమతిగా ఇచ్చి.. ‘నీ టైం బాగుంటుంది’ అని ప్రోత్సహించిన సమయంలో తీసిన ఫోటో అది. అసలు గోపీచంద్ మలినేని సినీ ప్రయాణం ఎలా సాగిందంటే.. రియల్ స్టార్ శ్రీహరి సినిమాతో ప్రారంభమయ్యింది. రియల్ స్టార్ శ్రీహరి నటించిన పోలీస్ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు గోపీచంద్ మలినేని. గోపీచంద్ మలినేని పెద్దమ్మ కొడుకు మాదాల రవి, నిర్మాత మహేంద్ర కూతుర్ని వివాహం చేసుకున్నారు. ఈ రిలేషన్ కారణంగా గోపీచంద్ మలినేని పోలీస్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే అవకాశాన్ని పొందారు.
ఆ తర్వాత ఈవీవీ సత్యనారాయణ సినిమాలకు పని చేశారు. శ్రీను వైట్లతో వెంకీ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. ఆ తర్వాత స్టాలిన్ సినిమాకి మురుగదాస్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమానే గోపీచంద్ లైఫ్ ని మలుపు తిప్పింది. స్టాలిన్ సినిమా షూటింగ్ సెట్స్ లో.. చిరంజీవి కళ్ళలో పడ్డారు గోపీచంద్. అప్పుడు గోపీచంద్ పుట్టినరోజు అయితే.. చిరంజీవి షూటింగ్ స్పాట్ లో ఒక వాచ్ తెప్పించి బహుమతిగా ఇచ్చి.. నీ టైం బాగుంటుందని చెప్పి ప్రోత్సహించారు. గోపీచంద్ హార్డ్ వర్క్, స్కిల్స్ చూసిన చిరంజీవి.. డైరెక్టర్ అవుతావని చెప్పారు. అలా చిరంజీవి ఇచ్చిన స్పూర్తితో కాన్ఫిడెన్స్ పెంచుకున్నారు గోపీచంద్ మలినేని.
ఆ తర్వాత కంత్రి సినిమాకి, బిల్లా సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. అయితే బిల్లా సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతున్న సమయంలో ప్రభాస్.. గోపీచంద్ మలినేని స్కిల్స్ చూసి.. ‘డైరెక్టర్ అవ్వచ్చు కదా’ అని సలహా ఇచ్చారు. ‘కథ చెప్పు, చేస్తా’ అని ముందుకు నెట్టారు. దీంతో గోపీచంద్ మలినేని డాన్ శీను కథ ప్రిపేర్ చేసి ఒక 5 నిమిషాలు ప్రభాస్ కి చెప్తే.. ‘బాగుంది డార్లింగ్ చేద్దాం’ అని అన్నారు. ఇండియాకి వచ్చిన తర్వాత అనుకోకుండా ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమా ఒప్పుకున్నారు. దీంతో హీరో గోపీచంద్.. ‘నీ దగ్గర కథ ఉందట కదా, మా ప్రభాస్ చెప్పాడు’ అని గోపీచంద్ మలినేనిని అడిగారు. ఈ గోపీచంద్, హీరో గోపీచంద్ కి కథ చెప్తే.. డైరెక్టర్ గోపీచంద్ కి హీరో గోపీచంద్ ‘సినిమా చేస్తా’ అని హామీ ఇచ్చారు.
గోపీచంద్ మలినేని కథ డెవలప్ చేస్తుండగా.. డాన్ శీను సినిమాని నిర్మించాలనుకున్న దిల్ రాజు వచ్చి.. ఈ సినిమా రవితేజకే సూటవుతుందని చెప్పారు. సరిగ్గా డాన్ శీను ప్రొడ్యూస్ చేద్దామనుకున్న దిల్ రాజుకి.. బృందావనం సినిమా చేయాల్సి వచ్చింది. ఆర్ఆర్ మేకర్స్ ఈ డాన్ శీను సినిమాని నిర్మించేందుకు ముందుకొచ్చారు. దీంతో గోపీచంద్.. దిల్ రాజు గారి బ్యానర్ లో అయితేనే చేస్తానని వదులుకున్నారు. ఆ తర్వాత ఈ కథ గురించి రవితేజకు తెలిసి.. గోపీచంద్ మలినేనిని సంప్రదించారు. ‘అమితాబ్ బచ్చన్ ఫ్యాన్, ఒక కుర్రాడు డాన్ అవ్వాలనుకునే క్యారెక్టరైజేషన్.. ఇది నా నాకు సూటయ్యే కథ కదా’ అని రవితేజ అన్నారు.
అలా రవితేజతో డాన్ శీను సినిమాకి మెగాఫోన్ పట్టి దర్శకుడు అయ్యారు గోపీచంద్ మలినేని. ఆ తర్వాత బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, క్రాక్, వీర సింహారెడ్డి ఇలా వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్నారు. బాలయ్యతో చేసిన వీర సింహారెడ్డి మాసివ్ హిట్ తో స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోయారు. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. అసోసియేట్ డైరెక్టర్ గా, దర్శకుడిగా.. స్టార్ దర్శకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న గోపీచంద్ మలినేనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.