పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఓవైపు పాలిటిక్స్ లో యాక్టీవ్ గానే ఉంటూ వరుసగా కొత్త సినిమాలను లైనప్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా పూర్తిచేసే పనిలో ఉన్న పవన్.. వీరమల్లుతో పాటు వినోదయ సితం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను లైనప్ చేశాడు. కానీ.. ఈ రెండు సినిమాలకంటే యంగ్ డైరెక్టర్ సుజీత్ తో చేయనున్న ‘ఓజి’ మూవీపై ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే.. పవన్ ఓకే చేసిన వినోదయ సితం, ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ రెండూ తమిళ రీమేక్స్ గా తెరకెక్కనున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్ బాయ్ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజి’.. అనే కొత్త కథను ఓకే చేయడంతో ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు.
ఇక తాజాగా జనవరి 30న ‘ఓజి’ మూవీ పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్, సుజీత్, డీవీవీ దానయ్యలతో పాటు చాలామంది టాలీవుడ్ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత దానయ్య నిర్మిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ ఇది. ఈ సినిమాకి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించనుండగా.. తమన్ ఎస్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓకే అయ్యాడు. అయితే.. ఓజి పూర్తి ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ తో పాటు పవన్ పెట్టుకున్న హ్యాండ్ వాచ్ హైలెట్ గా మారింది. ప్రెజెంట్ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కొత్త లుక్ తో పాటు.. ఆయన వాచ్ పై ఫోకస్ పెట్టారు అభిమానులు.
మరి పవన్ ధరించిన వాచ్ కంపెనీ ఏంటి? దాని ధర ఎంత అనే వివరాలు ఆరా తీసే పనిలో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. పవన్ ధరించిన వాచ్ ‘పనేరాయ్’ అనే ప్రముఖ కంపెనీకి చెందిందని.. దాని ధర దాదాపు రూ. 13.52 లక్షలుగా ఉంటుందని తెలుస్తోంది. పవన్ వాచ్ కి సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేసుకుంటున్నారు అభిమానులు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడట. చాలాకాలం తర్వాత పవన్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూడబోతున్నామని ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో.. మిగతా కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ న్యూ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Cute moments and at the end kalyan babu in drive mode 😍🔥 #FireStormIsComing @PawanKalyan
pic.twitter.com/R3aaE4Q3Eg— ★彡 𝙽𝚊𝚟𝚎𝚎𝚗 𝙹𝚂𝙿 🦅彡★ (@_jspnaveen) January 30, 2023
#PawanKalyan watch 👌!! Evaraina Naku gift ivandi Anna 😜#FireStormIsComing #OG pic.twitter.com/6AJV4rY9wj
— ★彡 𝙽𝚊𝚟𝚎𝚎𝚗 𝙹𝚂𝙿 🦅彡★ (@_jspnaveen) January 30, 2023