సినీరంగంలో నటించే నటీనటులు ఎప్పుడు స్టార్లుగా మారిపోతారో చెప్పలేము. వారు ఎంచుకున్న కథలను బట్టి, ప్రేక్షకుల ఆధరణను బట్టి నటీనటుల యొక్క స్టార్ డం ఆధారపడి ఉంటుంది. కొన్ని సినిమాలు అనూహ్యంగా విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోతాయి. అటువంటి సినిమాల్లో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దీంతో వారు కొన్నేళ్లపాటు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తారు. అయితే కొన్ని కొన్ని సార్లు సినిమాలు అనుకున్న విధంగా ప్రేక్షక ఆదరణ పొందక ఫ్లాప్ గా నిలిచిపోతాయి. అటువంటి సమయాల్లో హీరోహీరోయిన్లకు అవకాశాలు రాక తెర నుంచి కనుమరుగై పోతారు. ఇదే విధంగా ఓ సినిమాలో అలరించిన ఓ హీరోయిన్ ఆ సినిమా తరువాత మళ్లీ కనిపించలేదు. ఆమె ఎవరు? ఎందుకు సినిమా అవకాశాలు తగ్గాయి అనేది తెలుసుకుందాం.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాటల్లో చెప్పలేనిది. తన వైవిధ్యమైన నటనతో అశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు. ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ను తమ ఆరాధ్య దేవుడిగా ఆరాదిస్తుంటారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమాలలో హిట్ తో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం ఫ్లాప్ తో సంబందం లేకుండా బాగా ఎంజాయ్ చేస్తారు. అటువంటి సినిమాల్లో గుడుంబా శంకర్ ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. తన కామెడీ టైమింగ్ తో ఆధ్యాంతం సినిమాలో అలరించారు. పవన్ కళ్యాణ్ స్టైల్ కు, యాటిట్యూడ్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. గుడుంబా శంకర్ సినిమాలో ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుని సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు.
ఆ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా కిళ్లీ కిళ్లీ అనే సాంగ్ యువతను ఓ ఊపు ఊపేసింది. ఆ పాటలో పవర్ స్టార్ డ్యాన్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. అయితే ఆ పాటలో పవన్ తో కలిసి స్టెప్పులేసిన నటి గుర్తుందా.. తాజాగా ఆమె హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ సినిమాలో కిళ్లీ కిళ్లీ అనే పాటకు చిందులేసిన ఆ హాట్ బ్యూటీ పేరు నతాన్య సింగ్. ఆమె బాలీవుడ్, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించింది. కన్నడలో ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ యాక్టర్లతో నటించింది. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించింది. 2008లో వచ్చిన బుద్దివంత చిత్రం లో నతాన్య సింగ్ నటించింది. ఆ తరువాత మళ్లీ సినిమాలు చేయలేదు. అయితే తాజాగా నతాన్య సింగ్ హాట్ ఫోటోలతో నెట్టింట వైరల్ గా మారింది.