తెలుగు చిత్రపరిశ్రమలో యంగ్ స్టార్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. అనేక భిన్నమైన సినిమాలతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. అతడు నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఇటీవలే ‘ఆడవాళ్లు మీకు జోహర్లు’ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం శర్వానంద్ పలు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో ఒకరైనా శర్వానంద్.. త్వరలో వివాహబంధంలోకి అడుగు పెట్టబోతున్నాడు. దాదాపు రెండు మూడేళ్ళ నుంచి అతని పెళ్లి పైనే చర్చలు నడుస్తున్నా.. ఇప్పుడు ఆ విషయం కొలిక్కి వచ్చింది. శర్వానంద్ మనువాడనున్న వధువు వివరాలు బహిర్గతమయ్యాయి. రక్షిత రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వివాహం చేసుకోన్నుట్లు సమాచారం. అయితే రక్షిత రెడ్డి బ్యాగ్ గ్రౌండ్ ఎంటనే విషయం అందరు ఆసక్తి చూపిస్తున్నారు.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ఈమె తెలంగాణ హైకోర్టు లాయరు మధుసూదన్ రెడ్డి కుమార్తె. అంతేకాక చిత్తూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మనవరాలు. ఈ అమ్మాయి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అల్లుడు.. రక్షిత రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డికి సొదరుడు. అలా చూస్తే.. రక్షితా రెడ్డి.. గోపాల కృష్ణారెడ్డికి మనవరాలు అవుతోంది. ఇక మాజీ మంత్రి అల్లుడికి సొంత సోదరుడు మధుసూదన్ రెడ్డి.. శర్వానంద్ కి కాబోయే మామ. దీనిని బట్టీ చూస్తే రక్షిత రెడ్డి కి వేల కోట్ల రూపాయల ఆస్తులు అన్నాయని టాక్ వినిపిస్తోంది.
తన తండ్రి మధుసూదన్ రెడ్డి కూడా పెట్టిన ఆస్తులతో కోట్లలో ఉన్నాయని సమాచారం. అలానే తండ్రి ఆస్తితో పాటు పాటు తన తాతల తరం నుంచి వస్తున్న ఆస్తులు కూడా రక్షిత పేరు మీద ఉన్నాయ వార్తలు వినిపిస్తోన్నాయి. అలానే రక్షిత పేరు మీద కూడా బాగానే ఆస్తి ఉందంట. మొత్తంగా వేలకోట్ల ఆస్తి ఉన్న రక్షిత మెడలో శర్వానంద్ తాళికట్టనున్నాడు. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరి నిశ్చితార్థం హంగూఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా జరిగింది. శర్వానంద్ ది ప్రేమ వివాహం అంటూ ముందు జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లే అని తెలుస్తోంది.
ఏదేమైనా.. ఇటీవల “అన్‌స్టాపబుల్” షోలో బాలయ్య అడిగిన ప్రశ్నకు శర్వానంద్ త్వరగానే సమాధానం ఇచ్చేస్తున్నారు. ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతానికి శర్వా.. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో కలిసి ఒక సినిమా చేస్తున్నట్టు గుసగుసలు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ అని టాక్ వినిపిస్తోంది. మరి.. శర్వానంద్ పెళ్లి చేసుకోబేయే రక్షిత రెడ్డికి సంబంధించిన ఆస్తులపై వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.