చిత్రపరిశ్రమలో హీరోలైనా, హీరోయిన్స్ అయినా ఎక్కువకాలం ఫామ్ లో ఉండాలంటే ఖచ్చితంగా కథల ఎంపిక అనేది ప్రధానపాత్ర పోషిస్తుంది. ప్రారంభంలో ఒక్క హిట్ పడేసరికి వరుసగా అవకాశాలు రావచ్చేమో.. అందులో కెరీర్ కి ఉపయోగపడే కథలు, క్యారెక్టర్స్ ఏవో జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాల్సిన ఉంటుంది. సరే వస్తున్నాయి కదా అని.. నటనకు స్కోప్ లేకుండా గ్లామర్ రోల్స్ చేసుకుంటూపోతే.. ఫేడ్ అవుట్ జాబితాలో యాడ్ అయిపోతుంటారు. తెలుగులో డెబ్యూ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బ్యూటీ గౌరీ ముంజల్. ఢిల్లీకి చెందిన ఈ భామ అల్లు అర్జున్ సరసన బన్నీ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది.
కట్ చేస్తే.. సినిమా బ్లాక్ బస్టర్.. తెలుగుతో పాటు కన్నడ భాషలో కూడా అవకాశాలు వచ్చాయి. కానీ.. ఏం లాభం.. స్టార్ హీరోలతో సినిమాలు చేయాల్సిన గౌరీ.. వరుస ప్లాప్స్ కారణంగా చిన్న సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేసే స్థాయికి పడిపోయింది. తెలుగు, కన్నడ మాత్రమే కాకుండా తమిళ, మలయాళం భాషల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ.. ఎక్కడా రాణించలేకపోయింది. దీంతో కెరీర్ మొదలైన ఆరేళ్లకే సినీ ఇండస్ట్రీకి దూరమైంది. బన్నీ మూవీ తర్వాత తెలుగులో శ్రీకృష్ణ 2006, గోపి గోడ మీద పిల్లి, కౌసల్య సుప్రజా రామా లాంటి సినిమాలు చేసింది గౌరీ. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో పర్సనల్ లైఫ్ పై ఫోకస్ పెట్టింది.
ఇదిలా ఉండగా.. 1985లో పుట్టిన గౌరీ ముంజల్ వయసు ప్రస్తుతం 37 సంవత్సరాలు. మోడలింగ్ లో ఉన్నప్పుడే సినిమాల్లోకి రావాలని ముంబై చేరుకున్న గౌరీకి.. వివి వినాయక్ బన్నీ సినిమాతో ఇంట్రడ్యూస్ చేశాడు. కానీ.. కథల ఎంపిక సరిగ్గా లేకపోవడం వల్ల గౌరీ కెరీర్ ఆశించిన దారిలో సాగలేదు. ఇక సినిమాలకు దూరమయ్యాక గౌరీ.. తన ఫ్యామిలీతో ఢిల్లీలో ఉంటోంది. అలాగే తనకు ఆసక్తి ఉన్న వ్యాపారాలలో రాణిస్తున్నట్లు సమాచారం. కాగా.. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా గౌరీ పెళ్లి చేసుకోకపోవడం గమనార్హం. మరి త్వరలోనే పర్సనల్ లైఫ్ కి సంబంధించి ఏదొక గుడ్ న్యూస్ చెబుతుందేమో అని సినీ ప్రేక్షకులు చూస్తున్నారు.