వెండితెరపై నటించే హీరోయిన్లకే కాదు.. బుల్లితెరపై నటించే నటీమణులకు కూడా మంచి క్రేజ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. సీరియల్స్ లో నటించే నటులకు సినిమా తారలకు మించి పాలోయింగ్ వుంది. సినిమాల్లో నటించే వాళ్ళు కేవలం సినిమా రిలీజ్ రోజైన శుక్రవారం నాడే కనిపిస్తారేమో.. కానీ సీరియల్ ఆర్టిస్ట్ లు ప్రతీరోజూ ప్రేక్షకులను పలకరిస్తుంటారు.. అందుకే వీళ్ళని తమ కుటుంబ సభ్యులు లాగానే ఫీలవుతుంటారు ప్రేక్షకులు. సినిమాల్లో నటించే నటీ, నటులకు ఒక్కో సినిమాకు కాల్ షీట్ ఉంటే. సీరియల్ నటులకు మాత్రం వన్ డే కాల్ షీట్ వుంటుంది. పారితోషికం కూడా రోజు వారిగానే ఇస్తారు. సీరియల్స్ లో హీరోయిన్స్ నే ప్రధాన పాత్రలుగా చూపిస్తారు కాబట్టి.. వాళ్ల పారితోషికం కూడా భారీగానే ఉంటుంది.
ప్రేమి విశ్వనాథ్ :
బుల్లితెర వస్తున్న సీరియల్స్ లో ‘కార్తీకదీపం’ బాగా ఫేమస్ అయ్యింది. ప్రేమీ విశ్వనాథ్ వంటల అక్కగా మంచి గుర్తింపు తెచ్చుకున్నది. ఈ సీరియల్ లో దీప క్యారెక్టర్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈమె రెమ్యునరేషన్ రోజుకి 30 వేలు అందుకుంటుందట.
సుజిత :
వదినమ్మ సీరియల్‌తో బాగా పాపులారిటీ సంపాదించింది. ఈమె సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరిగా అందరికి సుపరిచితులు. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈమె నటించే సీరియల్స్ కి రోజుకి 25 వేలు అందుకుంటుందట.
నటి కస్తూరి :
కస్తూరి ఈమె ఒకప్పుడు సినీ హీరోయిన్ గా నటించింది. తర్వాత పలు చిత్రాల్లో క్యారెక్టర్ పాత్రలో నటించి ఇప్పుడు బుల్లితెరపై మెరుస్తుంది. గృహలక్ష్మీ సీరియల్‌లో కస్తూరి.. ప్రధాన పాత్ర పోషిస్తూంది. బుల్లితెరపై నటించినందుకు గాను ఈమె రెమ్యునరేషన్ రోజుకి 25 వేలు అందుకుంటుందట.
రాశి:
బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన రాశి తర్వాత హీరోయిన్ గా మారి తన అందంతో, నటనతో మంచి గుర్తింపు అందుకుంది. ఇక పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది. రాశి ‘గిరిజా కళ్యాణం’ సీరియల్ లో నటించింది. ఇక ప్రస్తుతం స్టార్ మాలో జానకి కలగనలేదు సీరియల్ లో అత్త పాత్రలో నటిస్తుంది. ఈమె రెమ్యునరేషన్ రోజుకి 25 వేలు అందుకుంటుందట.
సుహాసిని :
హీరోయిన్ గా నటించి బుల్లితెరపై రాణించిన వారిలో సుహాసిన ఒకరు. ‘చంటిగాడు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సుహాసిని.. ఆ తరువాత సినిమాల్లో క్లిక్ అవ్వకపోవడం వల్ల సీరియల్స్ లో నటిస్తూ వస్తుంది. ‘అపరంజి’ సీరియల్ తో మంచి గుర్తింపు పొందింది. ఈమె రెమ్యునరేషన్ రోజుకి 25 వేలు అందుకుంటుందట.
నవ్య స్వామి:
‘నా పేరు మీనాక్షి’ సీరియల్ తో తన బుల్లితెర ప్రస్థానాన్ని మొదలు పెట్టింది నవ్య.ప్రస్తుతం ‘ఆమె కథ’లో నటిస్తుంది. ఈమె రెమ్యునరేషన్ రోజుకి 25 వేలు అందుకుంటుందట.
మేఘన లోకేష్ :
జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘కల్యాణ వైభోగం’,‘రక్త సంబంధం’ సీరియల్స్ లో నటించింది మేఘన లోకేష్. గతంలో మేఘన లోకేష్ టాలీవుడ్ ప్రముఖ యాంకర్ రవి హీరోగా నటించిన ‘ఇది మా ప్రేమ కథ’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈమె రెమ్యునరేషన్ రోజుకి 20 వేలు అందుకుంటుందట.
ఐశ్వర్య పిస్సె :
అగ్నిసాక్షి సీరియల్ గౌరి అంటే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని పేరు. ఈ పాత్రలో అంత సహజంగా ఒదిగిపోయిన ఈ భామ అసలు పేరు ఐశ్వర్య పిస్సె. ప్రస్తుతం కస్తూరి అనే కొత్త సీరియల్‌తో కూడా ప్రేక్షకులను అలరించనుంది. ఈమె రెమ్యునరేషన్ రోజుకి 20 వేలు అందుకుంటుందట.
శోభా శెట్టి:
కార్తీక దీపం సీరియల్‌లో మోనిత కు కూడా మంచి పేరు వచ్చింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన శోభితా శెట్టి అక్కడ పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపించింది. ఈ అమ్మడు రెమ్యునరేషన్ రోజుకి 15 వేలు అందుకుంటుందట.
అనూష హెగ్డే:
జీ తెలుగులో వచ్చి నిన్నే పెళ్లాడుతా సీరియల్ లో మాన్సీ క్యారెక్టర్ లో నటించింది అనూష హెగ్డే. తర్వాత సూర్యకాంతం సీరియల్ లో నటించింది. ఈమె రెమ్యునరేషన్ రోజుకి 15 వేలు అందుకుంటుందట.
టీవీ సీరియల్స్ లో నటిస్తూ మంచిపాపులారిటీ సంపాదించి, హీరోయిన్స్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న బుల్లితెర నటీమణుల విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.