టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం డీజే టిల్లు(DJ Tillu) హవా నడుస్తుంది. ఇటీవలే చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి హిట్ అందుకుంది డీజే టిల్లు. విడుదలైన ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని.. కలెక్షన్స్ పరంగా కూడా రికార్డులు నమోదు చేస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు.. రిలీజ్ రోజునే ట్రేడ్ అంచనాలను బ్రేక్ చేసింది. మొదటిరోజు సుమారుగా 2 కోట్ల బిజినెస్ చేస్తుందని భావించిన ట్రేడ్ వర్గాలకు.. ఏకంగా 3 కోట్లకు పైగా షేర్స్ రాబట్టి షాకిచ్చిందని సమాచారం.
డీజే టిల్లు.. ఫస్ట్ డే నైజాం, ఏపీలో కలిపి ఏకంగా 3 కోట్ల 10 లక్షల రూపాయల షేర్ వచ్చింది. గ్రాస్ రూపంలో చూసుకుంటే 5 కోట్ల వరకు రాబట్టింది. అటు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో కలుపుకొని, 24 గంటల్లో 2 లక్షల డాలర్లకు పైగా వసూళ్లు చేసింది. ఇక రెండో రోజు.. నైజాంలో కోటి 54 లక్షల రూపాయల షేర్ రావడం విశేషం. కేవలం సీడెడ్ నుంచే ఈ సినిమాకు 50 లక్షల షేర్ వచ్చింది. ఏపీలో లిమిటెడ్ గా రిలీజైన డీజే టిల్లు.. వసూల్ చేసింది లక్షల్లోనే అయినప్పటికీ.. బడ్జెట్ బట్టి చూస్తే, డిస్ట్రిబ్యూటర్లంతా దాదాపు బ్రేక్ ఈవెన్ కు దగ్గరైపోయారు.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ తో పోల్చుకుంటే, డీజే టిల్లు పెట్టిన ఖర్చుకు దాదాపు 10 రెట్లు ఎక్కువగా రాబట్టేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదేగనక జరిగితే.. ఈ ఏడాది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా డీజే టిల్లు నిలుస్తుంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో ఈ సినిమాకు రెండు రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
ఏపీ – తెలంగాణ:- 5.80CR(10.83Cr గ్రాస్)
(KA+ROI: 0.45Cr)
ఓవర్సీస్ : 1.25Cr
టోటల్(World Wide): 7.50CR (13.80Cr గ్రాస్)
రెండు రోజులు కలిపి 8.95Cr రాబట్టింది.
బ్రేక్ ఈవెన్: 9.50Cr
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకి రామ్ మిర్యాల, శ్రీచరణ్ పాకాల సాంగ్స్ కంపోజ్ చేయగా.. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. మరి డీజే తిళ్ళు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.