‘డీజే టిల్లు’కు సినిమా కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఒక్కరంటే ఒక్క హీరోయిన్ సరిగా నిలబడట్లేదు. సినిమా ఏమో ఇంకా ట్రాక్ పైకి ఎక్కనేలేదు. అప్పుడే వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందిరా బాబు అని నెటిజన్స్ అందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సినిమా విషయంలో హీరోయిన్స్ ఎందుకలా ప్రవర్తిస్తున్నారు. లేదా రోల్ కి తగ్గ హీరోయిన్ దొరక్క.. మూవీ టీమ్ వద్దనుకుంటుందా అనే విషయం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరుగుతుంది?
ఇక వివరాల్లోకి వెళే… కొన్ని సినిమాలు హిట్ వెనక కారణం ఏంటనేది తెలుసుకోవడం చాలా కష్టం. అలా ప్రేక్షకుల్ని విపరీతంగా ఎంటర్ టైన్ చేసిన వాటిలో ‘డీజే టిల్లు’ ఒకటి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన ఈ మూవీ.. టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. హీరో సిద్ధుకు చాలా గుర్తింపు తీసుకొచ్చింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే కొన్నిరోజుల ముందు షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. చిన్న టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. దీంతో ఆడియెన్స్ కూడా ఎక్స్ పెక్టేషన్స్ పెంచుకున్నారు. అంతా బాగానే ఉంది.. కానీ హీరోయిన్ విషయంలో చిక్కొచ్చి పడింది.
ఫస్ట్ పార్ట్ లో రాధిక రోల్ చేసిన నేహాశెట్టినే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ మార్పు కోసం ఆమెని కాదని హీరోయిన్ శ్రీలీలని తీసుకున్నట్లు అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఏమైందో ఏమో కానీ ఆమె వాకౌట్ చేసిందని వార్తలొచ్చాయి. ‘కార్తికేయ 2’తో హిట్ కొట్టిన అనుపమ.. హీరోయిన్ అని అన్నారు. ఆమె కూడా ‘డీజే టిల్లు 2’ నుంచి బయటకొచ్చేసింది. కానీ ఆమె కూడా జంప్ అని టాక్ వినిపించింది. ఇక తెలుగులో ‘ప్రేమమ్’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన మడోన్నా సెబాస్టియన్ ని హీరోయిన్ గా తీసుకున్నారని వినిపించింది. కానీ ఇప్పుడు ఆమె స్థాయిలో ‘హిట్ 2’ భామ మీనాక్షి చౌదరి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక మీనాక్షిని అయినా సరే ‘డీజే టిల్లు 2’ మూవీలో ఉంటుందా? లేదంటే ఈమె కూడా..! అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో రొమాంటిక్ సీన్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయని… ఆ విషయంలోనే హీరోయిన్-మూవీ టీమ్ మధ్య అండర్ స్టాండింగ్ కుదరట్లేదని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు తొలి పార్ట్ తీసిన డైరెక్టర్ విమల్ కృష్ణ సీక్వెల్ కు పనిచేయట్లేదు. అతడి ప్లేస్ లో మల్లిక్ రామ్ పనిచేస్తున్నాడు. ఇవన్నీ గమనిస్తున్న పలువురు నెటిజన్స్.. ‘డీజే టిల్లు 2’ ప్రాబ్లమ్స్ ఎప్పటికి క్లియర్ అవుతాయా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి హీరోయిన్ల మారుతుండటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.