టాలీవుడ్లో సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న తెలుగు నటీమణుల్లో దివి వడ్త్యా ఒకరు. ఏ స్టార్ హీరోయిన్‌కు తీసిపోని గ్లామర్‌తో అదరగొడుతోందీ బిగ్ బాస్ బ్యూటీ.
సోషల్ మీడియా వినియోగం ఈమధ్య కాలంలో బాగా పెరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ సామాజిక మాధ్యమాలను తెగ వాడేస్తున్నారు. ప్రేక్షకులు, అభిమానులకు చేరువయ్యేందుకు సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఒక వేదికగా చేసుకుంటున్నారు. అలాగే అవకాశాలు లేని సినీ తారలు సినిమా ఆఫర్ల కోసం దీన్ని వాడుకుంటున్నారు. చాలా మంది ముద్దుగుమ్మలు తమ అందాలతో గాలం వేసే పనిలో పడుతున్నారు. అయితే సినీ నటిగా పరిచయమై బిగ్ బాస్ షో ద్వారా ఫుల్ క్రేజ్‌ను తెచ్చుకుంది దివి వడ్త్యా. గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోందీ భామ. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటోంది.
తాజాగా దివి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని హాట్ ఫొటోలను పంచుకుంది. ఇందులో సముద్రతీరాన తన సోయగాలతో అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సాగరకన్య వేషంలో అలాంటి పోజులతో కుర్రకారును కిర్రెక్కిస్తోంది. ఆమె ఫొటోలను చూసిన ఫ్యాన్స్ ఏంటి దివి.. ఇంత అందంగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. బీచ్ పక్కన సోయగాల విందు చేసిన దివి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక, సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్ చిరంజీవి మూవీ ‘గాడ్ ఫాదర్’లో ఒక పాత్రలో మెరిసింది దివి. ఈ మూవీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ఏటీఎం’ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో ఆకట్టుకుంది దివి.