‘భీమ్లానాయక్’ సినిమా రిలీజైన అన్ని ప్రాంతాల్లో మంచి లాభాలే రాబట్టినా కూడా.. ఏపీలో మాత్రం సినిమా టికెట్ రేట్ల వ్యవహారం వల్ల ఒకింత నష్టాలు వచ్చాయని తెలుస్తోంది. నష్టాలు వచ్చినా పర్లేదు సినిమాని జీవో కోసం ఆపకండి.. నష్టాలు నేను భరిస్తానని పవన్ కల్యాణ్ అన్నారని సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ప్రముఖ డిస్టిబ్యూటర్ సత్యనారాయణ తెలియజేశారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి.
మొదట సినిమాకి రెండు డేట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 25, ఏప్రిల్ 1 అనుకున్నారు. అయితే ఏప్రిల్ ఒకటికి వెళ్తే ఆర్‌ఆర్‌ఆర్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని భావించి.. ఫిబ్రవరి 25నే విడుదలకు వెళ్లాలనుకున్నారు. ‘భీమ్లానాయక్ సినిమా రిలీజ్ అయ్యేవరకు సినిమా టికెట్లపై జీవో విడుదల కాదని పవన్ కల్యాణ్ గారు భావించారు. అలా తన ఒక్క సినిమా కోసం మిగిలిన వారిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకనే భీమ్లానాయక్ సినిమాని ఫిబ్రవరి 25న విడుదల చేశారు. నష్టాలు వచ్చినా నేను భరిస్తాను అంటూ పవన్ కల్యాణ్ డిస్టిబ్యూటర్లకు భరోసానిచ్చారు. తన సినిమా గురించి ఆలోచించకుండా పవన్ మిగిలిన సినిమాల కోసం ముందే రిలీజ్ పెట్టుకున్నారు.’ అంటూ సత్యనారాయణ తెలియజేశారు. సత్యనారాయణ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.