దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ RRR. ఈ మధ్యకాలంలో విడుదలైన ఈ మూవీ ఊహించని విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు నటించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ మూవీలో ఆయన నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ చిత్రంలోని కొమురం భీముడో అంటూ సాగే పాటకు Jr.Ntr తన నట విశ్వరూపాన్ని చూపించాడని పలువురు సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు.
ఆయన నటనకు నేషనల్ అవార్డు కూడా రావొచ్చంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని కొత్త చిత్రాల గురించి క్రేజీ అప్ డేట్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా కొరటాల శివ దర్శకత్వంలో Jr.Ntr NTR30వ సినిమా చేయనున్నాడు. అయితే గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం భారీ విజయాన్నే సాధించింది. ఇక మరోసారి వీరి కాంబినేషన్ లో NTR30 సినిమా రానుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇది కూడా చదవండి: Deepika: కేన్స్ వేడుకల్లో దీపికా పదుకొనే ధరించిన నెక్లెస్ ధరెంతంటే!
ఇదే మూవీ గురుంచి ఫిల్మ్ నగర్ లో ప్రస్తుతం ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ చక్కర్లు కొడుతోంది. NTR30 మూవీలో Jr.Ntrకు హీరోయిన్ బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని నటించనుందనే వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఇక ఈ హీరోయిన్ ను ఎంపిక చేసుకుంటే బాలీవుడ్ లోనూ కలిసొస్తుందని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. మరి నిజంగానే NTR30 మూవీలో Jr.Ntr సరసన ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ నటిస్తుందో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వెయిట్ చేయాల్సిందే. Jr.NTRతో నటించ బాలీవుడ్ హాట్ బ్యూటీ. Jr.Ntrతో దిశా పటాని నటించనుందనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.