సినిమా అనేది రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో డార్క్ కలర్ కూడా ఉంటుంది. హీరోయిన్ అవుదామని ఎన్నో ఆశలతో వచ్చే యువతుల జీవితాలని చీకట్లోకి నెట్టేసే డార్క్ కోణం కూడా ఉంటుంది. సినిమా అవకాశాలు ఇస్తానని నమ్మించి వారి అశ్లీల దృశ్యాలు చిత్రీకరిస్తూ యువతుల జీవితాలతో ఆడుకుంటున్న డైరెక్టర్ ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు సేలంలో వేల్ క్షత్రియన్(38) అనే దర్శకుడు యాక్టింగ్ స్కూల్ నడుపుతున్నాడు. అతని అసిస్టెంట్ జయజ్యోతి(23)తో కలిసి యువతులను మోసం చేస్తున్నాడు. సినిమా అవకాశాలు ఇస్తానని యువతులకు వల వేసి సీక్రెట్ కెమెరాల ద్వారా యువతుల అశ్లీల దృశ్యాలు చిత్రీకరించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడు.
అదే ఆఫీస్ లో పని చేసే ఒక యువతి సూరమంగళం మహిళా పోలీస్ స్టేషన్ లో వీరి మీద కంప్లైంట్ చేసింది. వేల్ క్షత్రియన్, అతని అసిస్టెంట్ జయజ్యోతి ఇద్దరూ సినిమా అవకాశాల పేరుతో అశ్లీల వీడియోలను చిత్రీకరించి.. వాటితో యువతులను బెదిరిస్తున్నారని పేర్కొంది. ఇన్స్పెక్టర్ సుబ్బలక్ష్మి కేసు నమోదు చేసుకుని విచారణ జరపగా డైరెక్టర్ వేల్ క్షత్రియన్ ఘోరాలు బయటపడ్డాయి. అతని ఆఫీస్ లో తనిఖీలు నిర్వహించగా.. 30కి పైగా హార్డ్ డిస్క్ లు, వాటిలో 300 మందికి పైగా అమ్మాయిల అశ్లీల వీడియోలు, ఫోటోలు ఉన్నట్టు గుర్తించారు.
నగ్న వీడియోలు, అర్ధ నగ్న వీడియోలు, పోర్న్ వీడియోలు చిత్రీకరించి వంద మంది యువతులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. 30 హార్డ్ డిస్క్ లు, ల్యాప్ టాప్ లు, పెన్ డ్రైవ్ లు, సీసీ కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. మరి యువతులకు అవకాశాలు ఇస్తానని నమ్మించి అశ్లీల చిత్రాలు తీస్తున్న ఈ దర్శకుడిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
#Salem Police held Vel Sathyriyan, 38, who runs an acting course academy, & his assistant Jaya Jothi, 23, who exploited girls & women offering them a chance to play the lead role in Tamil movies. They cheated on 100 women in nude and semi-nude and even porn clips. @aselvarajTOI pic.twitter.com/DVSt71c7Bc
— A Selvaraj (@selvarajtoi) September 3, 2022