Trivikram: సినీ ఇండస్ట్రీలో తమ సినిమాలతో విజిల్స్ వేయించే దర్శకులు కొందరుంటారు. ఇంకొందరు సినిమాలోని పర్టికులర్ కొన్ని సన్నివేశాలతో ఆకట్టుకునే వారుంటారు. కానీ.. ఇండస్ట్రీలో కేవలం డైలాగ్స్ తో ఫ్యాన్స్ ని విజిల్ వేయించడం, సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేయడం అనేది తక్కువమంది దర్శకులకు సాధ్యమవుతుంది. అయితే.. పంచ్ డైలాగ్స్ తో విజిల్స్ వేయించేవారు వేరు. కానీ.. తాను రాసే ప్రతి డైలాగ్ తో ప్రేక్షకులను ఆలోచించేలా చేసే దర్శకరచయిత అనగానే టాలీవుడ్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరే ముందుంటుంది.
ఇప్పటివరకు త్రివిక్రమ్ సినిమాలు చూసినవారందరికి తెలుసు.. ఆయన పెన్ పవర్.. ఆయన రాసే ఆలోచనాత్మకమైన మాటలు.. ఆయన స్పీచ్ లో ఉండే మోటివేషన్ తాలూకు లక్షణాలు.. ఇలా ప్రతి విషయంలో మనిషిని మోటివేట్ చేయగలిగే సత్తా త్రివిక్రమ్ గారికి ఉందని ప్రత్యేకంగా ప్రూవ్ చేసే అవసరం లేదు. ఇప్పటికి ఎన్నో సినీ ఫంక్షన్స్ లో స్టేజిపై త్రివిక్రమ్ మాట్లాడారు. ఎంతోమందిని తన మాటలతో ఇన్స్పైర్ చేశారు. అందుకే అభిమానుల చేత ‘గురూజీ, మాటల మాంత్రికుడు’ అనే బిరుదులు కూడా సొంతం చేసుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా స్టూడెంట్స్ ని ఉద్దేశించి, వారిని మోటివేట్ చేసేందుకు త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విద్యార్థులు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుందనే విషయంపై మాట్లాడిన త్రివిక్రమ్.. ’20 మైల్స్ జర్నీ’ అనే చిన్న కథను ఉదాహరణగా చెప్పడం హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం నెట్టింట త్రివిక్రమ్ మోటివేషనల్ స్పీచ్ ట్రెండ్ అవుతోంది. మరి త్రివిక్రమ్ కొత్త స్పీచ్ మీరు కూడా చూసి, మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.