మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. సోమవారం ఉదయం నుంచి జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు తనీఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద తివిక్రమ్ వెళ్తున్న కారును పోలీసులు అడ్డుకున్నారు. త్రివిక్రమ్ కారు అద్దాలకు బ్లాక్ ఫిలిమ్ ఉండటంతో వాటిని తొలగించి రూ. 700 జరిమాన విధించారు. దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు మరికొందరికి సైతం జరిమాన విధించారు జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ పోలీసులు.
గత కొన్ని రోజులు గా కార్లకున్న బ్లాక్ ఫిల్మ్‌లను తొలగిస్తూ.. జరిమానాలను విధిస్తున్నారు హైదరాబాద్ మహా నగర్ ట్రాఫిక్ పోలీసులు. ఈ క్రమంలో వారం రోజులు క్రితం హీరో అల్లు అర్జున్, కళ్యాణ్ రామ్, మంచు మనోజ్ లకు కూడా ఫైన్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. ఇక ఇవాళ దర్శకుడు త్రివిక్రమ్ కారు అద్దాలకు బ్లాక్ ఫిలిమ్ తొలగించి జరిమానా విధించిన జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.