విలక్షణ దర్శకుడు తేజ ప్రసుత్తం దగ్గుబాటి అభిరామ్ హీరోగా అహింస సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్‌లో భాగంగా తేజ.. ఆంధ్రుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
టాలీవుడ్‌కు కొత్త నటీనటులను పరిచయం చేసే దర్శకుల్లో.. డైరెక్టర్ తేజ ముందు వరసలో ఉంటారు. నాడు చిత్రం సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ మొదలు.. నేడు అహింస చిత్రం ద్వారా దగ్గుబాటి అభిరామ్ వరకు టాలీవుడ్‌కి ఎందరో ప్రతిభావంతులైన హీరో, హీరోయిన‍్లను పరిచయం చేసిన ఘనత దర్శకుడి తేజది. ప్రస్తుతం తేజ.. దగ్గుబాటి అభిరామ్ హీరోగా అహింస సినిమాను తెరకెక్కిస్తున్నాడు. జూన్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు తేజ.. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నాడు తేజ. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు తేజ. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఆంధ్రులను ఉద్దేశించి తేజ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆంధవాళ్లకి సిగ్గు లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు తేజ. ఆంధ్ర వాళ్లకి ఆత్మాభిమానం లేదా అని ప్రశ్నించారు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తేజ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆంధ్ర బ్యాంక్ అని ఒకటి ఉండేది… కానీ ఇప్పుడు ఉందా.. లేదు. వీలినం చేశారు. అదే పంజాబ్ బ్యాంక్ ఉంది, కెనరా బ్యాంక్ ఉంది.. కానీ ఆంధ్ర బ్యాంక్ లేదు. కారణం ఆంధ్ర వాళ్లకి మన అనే ఫీలింగ్ లేదు. ఆ మాకేంది పోతే పోయింది అనుకున్నారు. మనకు సిగ్గు లేదు. ఆంధ్ర బ్యాంక్ విలీనాన్ని అడ్డుకోవడానికి ఎవరూ ప్రయత్నించలేదు.. అసలు పట్టించుకోలేదు. అందుకే ఆంధ్రా వాళ్లకు సిగ్గులేదు అంటున్నాను’’ అన్నారు తేజ.
తెలుగు నేలపై సుమారు 97 సంవత్సరాల పాటు సేవలందించిన ఆంధ్ర బ్యాంక్‌ని.. మూడేళ్ల క్రితం అనగా 2020 ఏప్రిల్ 1 తేదీన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు పట్టాభి సీతారామయ్య 1923 నవంబరులో ఆంధ్రాబ్యాంక్‌ని స్థాపించారు. 1980 లో ఇందిరాగాంధీ ప్రభుత్వ హయాంలో ఈ బ్యాంక్.. జాతీయ బ్యాంకుగా అవతరించింది. బ్యాంకులను బలోపేతం చేయాలని ఉద్దేశంతో 2020 ఏప్రిల్ 1న ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ని కేంద్ర ప్రభుత్వం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినప్పటికి.. బ్యాంక్ విలీనం మాత్రం ఆగలేదు. మరి తేజ చేసిన వ్యాఖ్యాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.