డైరెక్టర్ తేజ తన కూతురి పెళ్లి విషయమై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఆమెకి పెళ్లి చేయనని చెబుతూ, ఎందుకనే కారణం కూడా బయటపెట్టారు. ఇంతకీ ఏంటి సంగతి?
డైరెక్టర్ తేజ పేరు చెప్పగానే ‘నువ్వు నేను’, ‘జయం’ లాంటి అద్భుతమైన సినిమాలు గుర్తొస్తాయి. అయితే ఈయన కెరీర్ లో హిట్స్ కంటే ఫ్లాఫ్ మూవీసే ఎక్కువ. దీంతో ఏళ్లకు ఏళ్లు గ్యాప్ ఇచ్చి మరీ చిత్రాలు చేస్తుంటారు. తాజాగా ‘అహింస’ అనే సినిమాను రిలీజ్ కు రెడీ చేశారు. రానా తమ్ముడు అభిరామ్, ఈ మూవీతోనే హీరోగా పరిచయమవుతున్నాడు. దీని ప్రమోషన్స్ లో భాగంగా తేజ పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు-కూతురు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు అవి కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. నెటిజన్స్ మధ్య చర్చకు దారితీశాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. డైరెక్టర్ తేజ పేరు చెప్పగానే ఆయన సినిమాలతో పాటు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి గుర్తొస్తాడు. ఏ విషయాన్ని అయినా సరే కుండబద్ధలు కొట్టిన చెప్తాడు. ఫస్ట్ డిఫరెంట్ గా అనిపిస్తుంది గానీ సరిగా ఆలోచిస్తే అదే కరెక్టేమో అనిపిస్తుంది. తేజ కొడుకు హీరోగా పరిచయమవుతున్నాడు ఇందులో నిజమెంత అని అడగ్గా.. ‘మా అబ్బాయి డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశాడు. త్వరలోనే హీరోగా పరిచయం చేస్తాను’ అని డైరెక్ట్ గా తేజ చెప్పేశాడు. రూమర్స్ కు చెక్ పెట్టేశాడు. అలానే తన కూతురికి పెళ్లి చేయనని క్లారిటీ ఇచ్చేశాడు. దీనికి కారణం కూడా బయటపెట్టాడు.
‘మా అమ్మాయి ఫారెన్ లో చదువు పూర్తి చేసుకుని వచ్చింది. తనకు నేను పెళ్లి చేయను. నచ్చిన వాడిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమని చెప్పాను. తర్వాత అందరికీ భోజనాలు పెడదామని అన్నాను. పెళ్లయ్యాక భర్త నచ్చకపోతే విడాకులు ఇచ్చేయమని చెప్పాను. ఎందుకంటే మన హ్యాపీగా బతకడం ముఖ్యం. జనాలు ఏమనుకుంటున్నారనేది అనవసరం’ అని తేజ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కాలంలో ఇలా ఆలోచించే తండ్రులు ఎంతమంది ఉంటార్రా బాబు అని నెటిజన్స్ అనుకుంటున్నారు. మరి డైరెక్టర్ తేజ, తన కూతురి విషయంలో చెప్పిన థియరీపై మీరేం అనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.