సౌత్ సినీ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకొని వరుస హిట్లతో దూసుకుపోతుంది సాయిపల్లవి. ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. తాజాగా శర్వానంద్ – రష్మిక మందన జంటగా నటించిన ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది సాయిపల్లవి. ఈ ఈవెంట్ కి చిత్రబృందంతో పాటు స్పెషల్ గెస్టులుగా హీరోయిన్స్ కీర్తి సురేష్, సాయిపల్లవి, డైరెక్టర్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ స్టేజిపై కీర్తి, రష్మిక, సాయిపల్లవిలపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా సాయిపల్లవి గురించి మాట్లాడుతూ..’మీరు లేడీ పవన్ కళ్యాణ్ అనుకుంటా.. మీ గురించి ఎప్పుడు చెప్పలేదు. మంచి ఆర్టిస్ట్, అలాగే మంచి మనిషి కూడా.. ఒక హీరోయిన్ యాడ్ అనేది రిజెక్ట్ చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ విషయంలో నువ్వు అందరికి ఆదర్శంగా నిలుస్తావ్’ అంటూ ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి సాయిపల్లవి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.