సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలనేవి ఈ మధ్యకాలంలో విరివిగా తెరమీదకు వస్తున్నాయి. ఇంతకుముందు ఎవరి భాషల్లో ఆ హీరోలు తోటిహీరోలతో సినిమాలు చేసేవారు. కానీ.. కాలం మారుతున్నకొద్దీ నటీనటుల సినిమా సెలక్షన్స్ లో, నటనలో ఎన్నో మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఒక భాషా హీరోలు పరభాషా హీరోలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే మరో పవర్ ఫుల్ భారీ మల్టీస్టారర్ కి టైమ్ వచ్చిందేమో అనిపిస్తోంది.
ఇప్పటివరకూ ఎవరూ ఊహించని స్టార్ హీరోల కాంబినేషన్ ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ ఆ హీరోలెవరు? ఆ హీరోలను బ్యాలన్స్ చేస్తూ సినిమా తీసే డైరెక్టర్ ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే.. గురు, ఆకాశమే హద్దురా సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ సుధా కొంగర. ఈ లేడీ డైరెక్టర్ నుండి సినిమాలు లేటుగా రావొచ్చేమో గానీ, కంటెంట్ ప్రధానమైన సినిమాలే వస్తాయని మాత్రం గట్టిగా చెప్పవచ్చు.
డైరెక్టర్ సుధా కొంగర గురించి తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. గురు, ఆకాశమే హద్దురా సినిమాలకు ముందు ప్రేక్షకులకు సుధా చాలా కొత్త. కానీ.. ఇప్పుడు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆమె నుండి కొత్త సినిమా వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. సుధా ఓ భారీ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. దాదాపు నలుగురు హీరోలతో కూడిన స్క్రిప్టు ఆమె సిద్ధం చేసిందని టాక్.
ఇటీవలే సుధా దర్శకత్వంలో కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎవరితో, ఎప్పుడు, కాస్ట్ అండ్ క్రూ ఎవరనే విషయాలు ఇంకా బయటికి రాలేదు. కానీ.. కొత్తగా వినిపిస్తున్న వార్తల మేరకు.. అదే హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో మల్టీస్టారర్ ప్లాన్ చేసిందట. ఆ సినిమా కోసం హీరోలుగా సూర్య, నాని, దుల్కర్ సల్మాన్ లను భావిస్తున్నట్లు తెలుస్తుంది.
ఒకవేళ ఇదే గనక నిజమైతే.. అటు తమిళ, తెలుగు, మలయాళ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. కానీ.. నాలుగో హీరో ఎవరా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే నాలుగో హీరో కన్నడ నుండి అయ్యుంటాడని టాక్. అదీగాక హోంబలే ఫిలిమ్స్ అంటే.. కన్నడ ఇండస్ట్రీనే కాబట్టి.. ఖచ్చితంగా నాలుగో హీరో కన్నడకు చెంది ఉంటాడని అంటున్నారు. అందులోనూ హోంబలె ఫిలిమ్స్ కేజీఎఫ్, కేజీఎఫ్ 2 లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ నమోదు చేసింది.
ఈ లెక్కన నలుగురు హీరోలతో మల్టీస్టారర్ అనేది హోంబలే నిర్మించడం పెద్ద విషయం కాదు. ఇక సుధా కొంగర అంటే.. కంటెంట్ ఉన్న సినిమాలే ప్లాన్ చేస్తుంది. కాబట్టి.. సూర్య, నాని, దుల్కర్ లతో సినిమా పక్కాగా ఉంటుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. మరి సూర్య, నాని, దుల్కర్ లతో సుధా మల్టీస్టారర్ మూవీ ఉంటే బాగుంటుందా లేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Heard that Sudha Next with Multistarrer & #Suriya is finalised for a lead Role
Produced By @hombalefilms@Suriya_offl @dulQuer #Hombalefilms pic.twitter.com/EyEvlA9y4C
— WE SMOKE CINEMA (@SmokeCinema) June 30, 2022