టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్లలో శ్రీనువైట్ల కూడా ఒకరు. 2018 తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న శ్రీనువైట్ల కుటుంబం విషయంలో మాత్రం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. దంపతులు ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో నడుస్తోంది. అయితే అలాంటి సమయంలో సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్టు చేశారు.
శ్రీనువైట్ల- రూప దంపతులకు ముగ్గురు కుమార్తెలనే విషయం అందరికీ తెలిసిందే. నెలరోజుల క్రితం ముగ్గురితో కలిసున్న ఫొటో షేర్ చేసి మీరు లేకుండా నేను లేను అంటూ భావోద్వేగానికి లోనవుతూ పోస్ట్ చేశారు. అప్పుడు అది బాగా వైరల్ అయ్యింది. విడాకుల విషయంలో శ్రీనువైట్ల పరోక్షంగా స్పందించారంటూ అంతా చెప్పుకొచ్చారు.
Cute conversation with my inquisitive little one❤️ pic.twitter.com/gN1I974NWc
— Sreenu Vaitla (@SreenuVaitla) July 24, 2022
అయితే ఇప్పుడు మరోసారి శ్రీనువైట్ల ఓ భావోద్వోగ భరిత వీడియో షేర్ చేశారు. అదేంటంటే.. ఆయన రెండో కుమార్తె అండర్ గ్రాడుయేషన్ కోసం అమెరికా వెళ్తోంది. విమానాశ్రయంలో ఆమెకు సెండాఫ్ ఇచ్చేందుకు కుమార్తెలతో కలిసి శ్రీనువైట్ల కూడా వెళ్లారు. ఆ సమయంలో కుమార్తెను పట్టుకుని బాగా ఎమోషనల్ అయ్యారు. దాదాపు ఏడ్చేసినంత పని చేశారు. ఆనంది అయితే అందరినీ పట్టుకుని ఏడ్చేసింది కూడా.
Life is beautiful but with your loved ones it’s more than beautiful. Can’t imagine life without my three musketeers!! pic.twitter.com/kqbNAu79CU
— Sreenu Vaitla (@SreenuVaitla) July 21, 2022
“నా రెండో కుతూరు అండర్ గ్రాడుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. నాకు ఇప్పుడు అర్థమవుతోంది.. ఇదే వయసులో నేను చెన్నై వెళ్లినప్పుడు మా నాన్న కూడా ఇలాగే ఫీలైఉంటారు. జీవితం అనేది ఓ చట్రం లాంటిది. నాకు తెలుసు నా కుమార్తె నన్ను గర్వపడేలా చేస్తుందని’ అంటూ శ్రీనువైట్ల ట్వీట్ చేశారు. డైరెక్టర్ ఎమోషనల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
My eldest daughter has flown to US for her under-grad.
Now I understand how my father might have felt when I left for Chennai at the same age. Life is a cycle and I am sure.. my dearest Aanandi would make me the prouder father!
❤️ pic.twitter.com/xjJ1o80Wgz— Sreenu Vaitla (@SreenuVaitla) August 24, 2022