ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కరోనా విలాయతాండవంలో ఎంతో మంది సినీ ప్రముఖులు తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా లెజండరీ డైరెక్టర్ సింగీతం సింగీతం శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన సతిమణి లక్ష్మీ కల్యాణి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె ఇటీవల చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇక చికిత్స పొందుతున్న ఆమె శనివారం రాత్రి మృతి చెందారు.
‘నా భార్య లక్ష్మీ కల్యాణి శనివారం రాత్రి 9.10గంటలకు తుదిశ్వాస విడిచింది. 62ఏళ్ల సుదీర్ఘమైన మా భాగస్వామ్యానికి ముగింపు పడింది’ అని సింగీతం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉంటే సింగీతం శ్రీనివాసరావు, లక్ష్మీకల్యాణిల వివాహం 1960లో జరిగింది. అయితే ఆయన సినిమా ప్రస్థానంలో లక్ష్మీ కల్యాణి ఆయన వెన్నంటి నిలిచినట్లు సినీ ప్రముఖులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Suresh Chakravarthy: నాగార్జున-అమల లవ్‌స్టోరీలో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారో చెప్పేసిన అమల బ్రదర్!వీరిద్దరి మధ్య అపురూపమైన బంధం ఉండేదని తెలుస్తోంది. ఇక తన భార్య లక్ష్మీ కల్యాణి గురించి ఆయన ఏకంగా ‘శ్రీకల్యాణీయం’అనే ఓ పుస్తకాన్ని కూడా రాయడం విశేషం. చిత్ర పరిశ్రమలో లెజండరీ డైరెక్టర్ గా పెరుతెచ్చుకున్న సింగీతం శ్రీనివాస్ భార్య మరణించడంతో ఇండస్ట్రీలో కొంత విషాదం నెలకొంది. దీంతో కొందరు సినీ ప్రముఖులు ఆయనకు ధైర్యాన్ని నూరి పోస్తున్నారు. సింగీతం శ్రీనివాసరావు సతిమణి లక్ష్మీ కల్యాణి మరణ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.