దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనది అందె వేసిన చేయి. ఇక శంకర్ దర్శకత్వంలో నటించాలని సౌత్ హీరోలు మొదలు.. బాలీవుడ్ స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలని ఉవ్విళూరుతారు. ప్రస్తుతం శంకర్-రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. ఆడపిల్లలు ఇద్దరు డాక్టర్ కోర్స్ పూర్తి చేశారు.
ఇక శంకర్ పెద్ద కుమార్తె.. అదితి శంకర్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. విరుమాన్ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది. ఇక నటన అంటే ఆమెకు మొదటి నుంచి ఆసక్తి అని వెల్లడించింది. అయితే అదితి సినిమాల్లోకి రావడం ఆమె తండ్రి శంకర్‌కి ఎంత మాత్రం ఇష్టం లేదట. ఈ విషయాన్ని అదితి స్వయంగా వెల్లడించింది. విరుమాన్ చిత్ర ఆడియో విడుదల వేదికపై అదితి మాట్లాడుతూ.. నేను సినిమాల్లోకి రావడం మా నాన్నకి ఇష్టం లేదు. కానీ నేనే ఒప్పించాను. ఒకవేళ హీరోయిన్‌గా సక్సెస్ కాకపోతే.. మళ్లీ వైద్య వృత్తిని చేపడతానని నాన్నకు నచ్చజెప్పాను. దాంతో ఆయన ఒప్పుకున్నాడు’’ అని వెల్లడించింది.
ఇక అదితి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విరుమాన్ సినిమాకు దర్శకుడు ముత్తయ్య. కార్తీ హీరోగా నటించాడు. ఇప్పటి వరకు ఓకే కానీ.. అదితికి తరువాత వచ్చిన సినిమా ఆఫర్ శంకర్‌కు నచ్చలేదట. కుమార్ దర్శకత్వంలో, శింబు హీరోగా నటించే చిత్రంలో అదితికి హీరోయిన్‌గా అవకాశం లభించిందట. కానీ ఈ ఆఫర్ శంకర్‌కి నచ్చలేదట. దాంతో ఈ సినిమాలో నటించొద్దని అదితికి సూచించాడట.
శంకర్ ఇలా చెప్పడానికి కారణం శింబు మీద వచ్చే రూమర్సే కారణం అంటూ అనేక వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. శింబుపై అనేక వివాదాలు రావడం, ప్రేమ వివాదాలతో సంచలన నటుడిగా పేరు తెచ్చుకోవడంతో.. అతడితో కలిసి సినిమాలో చేయొద్దని శంకర్ కుమార్తెకు సూచించాడట. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. ఈ సినిమా అనేక సమస్యల కారణంగా పట్టాలెక్కకముందే ఆగిపోయింది. దాంతో శంకర్ సమస్య కూడా తీరిపోయింది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.