సెల్వ రాఘవన్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయారు. ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన 2006లో సోనియా అగర్వాల్‌ను పెళ్లి చేసుకున్నారు.
ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు సెల్వ రాఘవన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. ‘ఆడవారిమాటలకు అర్థాలే వేరులే’.. ‘ 7జీ బృందావన కాలనీ’ సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నారు. తమిళంలో ఆయన తీస్తున్న సినిమాలు తెలుగులో డబ్ అవుతూ వస్తున్నాయి. కార్తీ హీరోగా వచ్చిన ‘యుగానికి ఒక్కడు’ సినిమా అప్పట్లో తమిళంతో సమానంగా తెలుగులోనూ బ్లాక్ బాస్టర్ అయింది. దర్శకుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే సెల్వ రాఘవన్ జీవితంలో వరుస విషాదాలు దాగి ఉన్నాయి.
ఆరోగ్యం, పెళ్లి విషయంలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కంటి క్యాన్సర్ కారణంగా ఆయన జీవితంలో తీరని లోటు మిగిలిపోయింది. సెల్వ రాఘవన్ యువకుడిగా ఉన్నపుడు రెటీనల్ క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో వైద్యులు ఆయన కంటిని తీసేయాలని చెప్పారు. ఎడమ కంటిని ఆపరేషన్ ద్వారా తొలిగించారు. ప్రస్తుతం ఆర్టిఫియల్ కంటితో ఆయన జీవిస్తున్నారు. కాగా, తమిళంలో స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్న సమయంలో సెల్వ రాఘవన్ ప్రముఖ హీరోయిన్ సోనియా అగర్వాల్‌ను పెళ్లాడారు. 2006లో వీరి పెళ్లి జరిగింది.
అయితే, వీరి దాంపత్య జీవితం ఎక్కువ రోజులు సాగలేదు. మనస్పర్థల కారణంగా విడిపోయారు. 2009లో విడాకులు తీసుకున్నారు. సోనియాతో విడాకుల తర్వాత సెల్వ రాఘవన్.. గీతాంజలి రామన్ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సెల్వ రాఘవన్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయారు. తమిళ సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న రోల్స్ చేస్తూ ఉన్నారు. మరి, సెల్వ రాఘవన్ జీవితంలోని విషాదంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.