సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి న్యూస్ ఇట్టే వైరల్ అవుతుంది. కొన్నిసార్లు సెలబ్రెటీలు ఆరోగ్యం విషమంగా ఉందని.. చనిపోయారన్న వార్తలు రావడంతో తాము క్షేమంగానే ఉన్నామని వీడియో రిలీజ్ చేస్తూ క్లారిటీ ఇస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఇదిగో పులి అంటే.. అదిగో తోక అంటు కొన్ని వార్తలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి. బతికి ఉన్నా చనిపోయినట్లు ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలకు ఈ బెడద కాస్త ఎక్కువ అనే చెప్పొచ్చు. సెలబ్రెటీలపై వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్వయంగా వారే వచ్చి చెప్పడం.. లేదా వారి స్నేహితులు, బంధువులు వచ్చి మీడియా ముందు అవి అసత్య వార్తలు అని క్లారిటీ ఇస్తుంటారు. ఈ మద్యనే ప్రముఖ నటుడు శరత్ బాబు చనిపోయినట్లు మీడియాలో పుకార్లు రావడం.. ఆయన క్షేమంగా ఉన్నారని వారి బంధువులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఓ అభిమాని అత్యుత్సాహం.. దర్శకుడికి తలనొప్పిగా మారింది. వివరాల్లోకి వెళితే..
ఇటీవల సోషల్ మీడియాలో సెలబ్రెటీల గురించి వచ్చే అసత్య వార్తలకు వారు వెంటనే స్పందించి క్లారిటీ ఇస్తున్నారు. కొన్నిసార్లు ప్రముఖ నటీనటులు, దర్శకులు చనిపోయినట్లు పుకార్లు రావడంతో సన్నిహితులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్త తెలిసిన సదరు సెలబ్రెటీలు తాము బతికే ఉన్నాం బాబోయ్ అంటూ వీడియో రిలీజ్ చేసి నెటిజన్ల ముందుకు వస్తున్నారు. ప్రముఖ తమిల దర్శకుడు సెల్వరాఘవన్ పై ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. అభిమాని.. సెల్వ రాఘవన్ సినిమాలోని ఓ ఫోటోని షేర్ చేసి ‘ఈ మూవీ దర్శకుడు చనిపోయినట్లున్నారు.. లేదా పూర్తిగా సినిమాలు తీయడం ఉపైనా ఉంటాడు’ అటూ ట్విట్ చేశాడు.
ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో.. దీనిపై స్పందించిన సెల్వ రాఘవన్.. అభిమానికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు. ‘వై మై ఫ్రెండ్? నేను ఇంకా చనిపోలేదు.. అలా అని సినిమాల నుంచి రిటైర్ కూడా కాలేదు, నేను కాస్త నా సమయం గడుపుతున్నాను.. ఇంకా నేను నలభైలోనే ఉన్నా.. ఐ యామ్ బ్యాక్’ అంటూ సమాధానం ఇచ్చడు. ప్రస్తుతం వీరిద్దరి ట్విట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ‘తుళ్లువదో ఇలామై’ తో దర్శకుడిగా పరిచయం అయిన ఆయన తొలి చిత్రంతోనే పెద్ద హిట్ అందుకున్నారు. సెల్వ రాఘవన్ దర్శకుడిగానే కాకుండా పలు చిత్రాల్లో నటించారు. తెలుగులో కూడా మంచి విజయాలు అందుకున్నాడు.
Why my friend ? I’m not dead or retired. I have just spent some time for myself. I’m just in my forties .. And I’m back. https://t.co/CYdLcoG97k
— selvaraghavan (@selvaraghavan) May 3, 2023