ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శకులు, నిర్మాతలే కాకుండా ఇతర రంగాలకు చెందిన వారు కన్నుమూస్తున్నారు. కారణాలు ఏవైనా సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న విషాదాలకు ఓ వైపు కుటుంబ సభ్యులు మరోవైపు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ దర్శకుడు, రచయిత సావన్ కుమార్ తక్ అనారోగ్యంతో గురువారం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో ముంబాయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్ లో చికిత్స అందిస్తు వస్తున్నారు. చికిత్స పొందుతున్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో శరీర అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయం ఆయన కుటుంబ సభ్యులు.. సినీ నిర్మాత నవీన్ తెలిపారు. శుక్రవారం ఆయన అంత్యక్రియలు జరుపుతామని తెలిపాడు.
సావన్ కుమార్ తక్ 1972 లో గొమ్టి కే కినారే మూవీతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాలకు రచయితగా సేవలు అందించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సావన్ మృతిపై సల్మాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నా ప్రియమైన సావాన్ జీ మీరు శాంతితో విశ్రాంతి తీసుకోండి. మిమ్ముల్ని నేను ఎప్పుడూ ప్రేమిస్తూ, గౌరవిస్తూనే ఉన్నాను’అంటూ ట్విట్టర్ వేదికగా తన సంతాపాన్ని తెలిపారు.
May u rest in peace my dear Sawaan ji. Have always loved n respected u. pic.twitter.com/SH3BhYxco8
— Salman Khan (@BeingSalmanKhan) August 25, 2022