దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపించింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ సినిమా.. ఫిక్షన్ పీరియాడిక్ డ్రామాగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, రాంచరణ్ ల అద్భుతమైన నటనకు పాన్ ఇండియా వ్యాప్తంగా సినిమాకు నీరాజనాలు పలికారు ఫ్యాన్స్.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించాడు. అయితే.. సినిమా విడుదలై 3 వారాలు గడిచినా బాక్సాఫీస్ వద్ద ట్రిపుల్ ఆర్ హవా ఏమాత్రం తగ్గలేదనే చెప్పాలి. విడుదలైన రెండు వారాలకే ఆర్ఆర్ఆర్ 1000కోట్ల క్లబ్ లో చేరింది. సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చాక ఎన్టీఆర్ – చరణ్ క్యారెక్టర్స్ పై కామెంట్స్ వినిపించాయి. సినిమాలో చరణ్ క్యారెక్టర్.. తారక్ క్యారెక్టర్ ని డామినేట్ చేసిందని పుకార్లు అభిప్రాయాలు వెలువడ్డాయి.
ఇటీవల డైరెక్టర్ రాజమౌళి ఈ విషయంపై మాట్లాడినట్లు తెలుస్తుంది. రాజమౌళి మాట్లాడుతూ.. “ట్రిపుల్ ఆర్ లో ఎవరి డామినేషన్ లేదని.. చరణ్, తారక్ ఎవరికి వారే ది బెస్ట్ ఇచ్చారు. చరణ్ డామినేషన్ ఎక్కువగా ఉందనేది కరెక్ట్ కాదు. మనం చూసే దృష్టిలోనే ఏదైనా ఉంటుంది. క్లైమాక్స్ లో చరణ్ కు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండటం వల్ల అలా అనిపించవచ్చు. అదే కొమురం భీముడో సాంగ్ దగ్గరే క్లైమాక్స్ పెట్టి ఉంటే.. ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువగా ఉందనేవారు. అదేవిధంగా సినిమాలో చరణ్ ని తారక్ రెండుసార్లు రక్షిస్తాడు. తారక్ ని చరణ్ ఒక్కసారే రక్షిస్తాడు. ఒకచోట 15ఏళ్లుగా స్పష్టతలేని నా లక్ష్యానికి తారక్ దారి చూపించాడని అంటాడు. అంటే.. ఇక్కడ తారక్ హీరోగా.. చరణ్ ని ఫాలోవర్ అని అనుకోవచ్చు కదా” అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇక ట్రిపుల్ ఆర్ సినిమాలో బాలీవూడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని, ఒలీవియా మోరిస్ ప్రధాన పాత్రలలో నటించాడు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించిన ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ట్రిపుల్ తో చరణ్, తారక్ పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్నారు. అలాగే తదుపరి సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారు. మరి ట్రిపుల్ ఆర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.