దర్శకధీరుడు రాజమౌళి సమర్పకుడిగా మారి సౌత్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సినిమా ‘బ్రహ్మాస్త్ర’. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. విజువల్ వండర్ గా బ్రహ్మాస్త్ర మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే.. రిలీజ్ దగ్గర పడుతుండటంతో బ్రహ్మాస్త్ర టీమ్ తో పాటు డైరెక్టర్ రాజమౌళి కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో తాజాగా డైరెక్టర్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రూపంలో బ్రహ్మాస్త్ర మూవీపై, దర్శకుడు అయాన్ ముఖర్జీపై ప్రశంసలు కురిపించాడు. అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున, మౌనిరాయ్, షారుఖ్ ఖాన్ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమా.. తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో రిలీజ్ అవుతోంది. అయితే.. బ్రహ్మాస్త్ర సినిమా గురించి చెబుతూనే రాజమౌళి ఈ సినిమా కథ దేని గురించి ఉండబోతుంది? ఏం చూపించబోతున్నారు? ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? అనే విషయాలను వీడియోలో షేర్ చేసుకున్నాడు.
ఇక రాజమౌళి మాట్లాడుతూ.. “బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గురించి నేను కొత్త చెప్పక్కర్లేదు. అతను తీసిన సినిమాలు ఇండియన్ హిస్టరీలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే.. 2016లో అయాన్ నాకు మొదటిసారి బ్రహ్మస్త్ర కథ చెప్పాడు. ఈ కథ హిందూ పురాణాలను ఆధారంగా చేసుకుని రాశారు. మన పురణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న శక్తలన్నిటిని కలిపి ‘అస్త్రావర్స్’ అని క్రియేట్ చేశాడు అయాన్. ఈ అస్త్రావర్స్ ఏంటంటే.. మన శాస్త్రాల ప్రకారం.. మనిషి మనుగడకు మూలకారణం పంచభూతాలు.
ఆ పంచభూతాలను శాసించేది ‘బ్రహ్మశక్తి’. ఆ బ్రహ్మ శక్తి నుంచి పుట్టిన అస్త్రాల గురించి చెప్పేది ఈ బ్రహ్మస్త్ర కథ. అయితే.. ఆ అస్త్రాలను ఉపయోగించే సూపర్ హీరోల గురించి ఇందులో ఉండబోతుంది. ఉదాహారణకు వానరాస్త్ర అనేది ‘కింగ్ కాంగ్’కు ఉన్నంత బలం కలిగిఉంటుంది. ఈ అస్త్రాన్ని ధరించిన వారు కింగ్ కాంగ్ లాగే ఎంత దూరం ఎగరగలరో అంత దూరం ఎగరగలుగుతారు. అలాగే నంది అస్త్ర.. ఇది ధరిస్తే ఒక వెయ్యి ఒంగోలు గిత్తలకు ఉండే శక్తి వస్తుంది. ఇలా అస్త్రాలు చాలా ఉన్నాయి.
ఏ విధంగా ఇన్ని అస్త్రాలు, వాటిని ఉపయోగించే సూపర్ హీరోలు, వాళ్ళందరి మధ్య జరిగే సంఘర్షణ.. ఇవన్నీ కలిపి ఓ ఫెంటాస్టిక్ విజువల్ వండర్ లా బ్రహ్మాస్త్రను క్రియేట్ చేశాడు అయాన్. కానీ.. వీటిని మించి మరొక అద్భుతమైన శక్తి ఉంది. అదే ప్రేమ.. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎలాంటి శక్తిని అయినా ఫేస్ చేస్తుందని ఈ సినిమాలో చూపించాడు. అదీగాక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్ వారు రిలీజ్ చేస్తున్నారు. మరి సెప్టెంబర్ 9న బ్రహ్మాస్త్ర మూవీ మిస్ అవ్వకండి” అంటూ చెప్పుకొచ్చాడు. మరి బ్రహ్మాస్త్ర మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Brahmāstra is one of its kind film in the Indian Cinema. After travelling with #BRAHMASTRA for the past 9 years, Ayan is finally bringing it on to the big screens on September 9th. pic.twitter.com/xxXDK1UqtX
— rajamouli ss (@ssrajamouli) September 1, 2022