దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు మార్మోగిపోయేలా చేసాడు. అలాగే అప్పటివరకు తెలుగువరకే పరిమితమైన టాలీవుడ్ పరిమితులను.. అటు తమిళ, కన్నడ, మలయాళం భాషలతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమాలకు బాటలు వేసాడు. బాహుబలితో రాజమౌళి అన్ని ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షించాడు.
అయితే.. అంతవరకు తెలుగు వైపు కన్నెత్తి చూడని బాలీవుడ్ తారలు సైతం తెలుగు సినిమాల్లో నటిస్తాం.. అని ముందుకొచ్చేలా చేసిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. బాలీవుడ్ లో దర్శకధీరుడి ప్రభావం, ఆయనను ఆరాధించే విధానం ఏ స్థాయిలో ఉందో.. ఈ వీడియోనే సాక్ష్యంగా నిలుస్తుంది.
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో ‘బ్రహ్మాస్త్ర’ అనే సోషియో ఫాంటసీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైథలాజికల్ జానర్ లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం పాన్ ఇండియా రేంజిలో హిందీ మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది. తాజాగా బ్రహ్మాస్త్రకు సంబంధించి తెలుగు మోషన్ పోస్టర్ లాంచ్ ప్రోగ్రాం నిర్వహించింది చిత్రబృందం.
అయితే, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నాడు. స్టేజిపై రాజమౌళి మాట్లాడుతుండగా.. రణబీర్ స్టేజి పైకి వెళ్లి రాజమౌళి కాళ్లకు నమస్కరించడం మనం చూడవచ్చు. అంటే.. బాలీవుడ్ స్టార్ హీరోతో కాళ్లను నమస్కరించే స్థాయిలో రాజమౌళి నిలవడం అనేది.. సాటి తెలుగువారిగా మనం గర్వపడాల్సిన విషయంగా భావించవచ్చు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.