ఆ దర్శకుడు వరసగా మూడు అద్భుతమైన సినిమాలు తీసి హ్యాట్రిక్ కొట్టాడు. తెలుగు-తమిళంలో ప్రేక్షకుల్ని అలరిస్తూ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు లైఫ్ లో పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టాడు.
ఇది వింటర్ సీజన్ కాదు.. పెళ్లిళ్ల సీజన్. ఎందుకంటే సామాన్యుల దగ్గర నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు చాలామంది వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. టీమిండియా క్రికెటర్లు కూడా తమకు నచ్చిన వారితో ఏడడుగులు వేసేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో స్టార్ డైరెక్టర్ కూడా చేరాడు. గతేడాది ఓ లేడీ జర్నలిస్టుతో ఎంగేజ్ మెంట్ జరగ్గా తాజాగా పెళ్లిని.. చాలా సింపుల్ గా కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో చేసుకున్నారు. ఈ క్రమంలోనే సహ సెలబ్రిటీలు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. గతేడాది కార్తి హీరోగా ‘సర్దార్’ రిలీజైంది. ఈ సినిమా చూసిన చాలామంది.. అరే ఈ డైరెక్టర్ ఎవరూ భలే తీశాడే అని మాట్లాడుకున్నారు. కొన్నిరోజుల వరకు ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగాలంటేనే భయపడ్డారు. అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు పీఎస్ మిత్రన్. అంతకు ముందు అభిమన్యుడు, హీరో సినిమాలతోనూ తెలుగు-తమిళ ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేశారు. ఇకపోతే తాజాగా ఆయన జర్నలిస్టు ఆశామీరా అయ్యప్పన్ ని పెళ్లి చేసుకున్నాడు. గతేడాది జూన్ లో నిశ్చాతార్థం చేసుకున్న ఈ జంట.. తంజావూర్ లో ఆదివారం కొద్దిమంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే సహ దర్శకులు, నిర్మాణ సంస్థలు అభినందనలు తెలుపుతున్నాయి. మరి మీ తరఫున విషెస్ కూడా కింద కామెంట్ చేయండి.
Congratulations #PSMithran & #AshaMeeraAiyappan on a spectacular wedding and a lifetime of love and happiness ahead 💐💐💐💐
From entire team of #StudioGreen #PSMithranMarriage@Psmithran @aashameera pic.twitter.com/3eZcNYLiLN
— Studio Green (@StudioGreen2) February 12, 2023