ఈ మధ్య తెలుగు దర్శకులు తెలుగు హీరోలతోనే కాకుండా తమిళ హీరోలతో సైతం సినిమాలు చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇప్పుడిదే లిస్ట్ లోకి మరో తెలుగు దర్శకుడు చేరనున్నట్లు తెలుస్తోంది. 'సర్కారు వారి పాట' వచ్చి ఏడాది కావస్తోంది.. అయినా ఇప్పటిదాకా పరశురామ్ తదుపరి సినిమా ఎవరితో అనేది చర్చనీయాంశంగానే మారింది.
కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో వరుసగా పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో హీరోలు, దర్శకుల మధ్య ఎలాంటి బారియర్స్ లేకుండా పోయాయని చెప్పాలి. ఈ మధ్య తెలుగు దర్శకులు తెలుగు హీరోలతోనే కాకుండా తమిళ హీరోలతో సైతం సినిమాలు చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఇప్పటికే దళపతి విజయ్ తో వంశీ పైడిపల్లి సినిమా రిలీజై మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు ధనుష్ తో వెంకీ అట్లూరి ‘సార్’ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. మరోవైపు రామ్ చరణ్ తో దర్శకుడు శంకర్ సినిమా.. నాగచైతన్యతో వెంకట్ ప్రభు.. ఇలా కొన్ని క్రేజీ ప్రాజెక్టులు షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా.. ఇప్పుడిదే లిస్ట్ లోకి మరో తెలుగు దర్శకుడు చేరనున్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల.. గతేడాది సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమా చేసి మంచి విజయం అందుకున్నాడు. ఆ సినిమా వచ్చి ఏడాది కావస్తోంది.. అయినా ఇప్పటిదాకా పరశురామ్ తదుపరి సినిమా ఎవరితో అనేది చర్చనీయాంశంగానే మారింది. ఇటీవల విజయ్ దేవరకొండ – దిల్ రాజు కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేసినప్పటికీ.. అదే టైంలో నిర్మాత అల్లు అరవింద్ పేరు చర్చల్లోకి వచ్చి.. ఆ సినిమా మ్యాటర్ ఎటు తేలలేదు. పైగా ఎప్పుడు మొదలు కానుందో కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో తాజాగా పరశురామ్.. ఓ తమిళ స్టార్ హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది.
అదేంటీ మొన్నేగా విజయ్ దేవరకొండతో అన్నారు.. అంతలోనే తమిళ హీరోతో అంటున్నారని డౌట్ రావచ్చు. కానీ.. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం.. పరశురామ్, హీరో కార్తీని కలిసి ఓ స్టోరీ వినిపించాడని.. దానికి కార్తీ నుండి సానుకూలమైన స్పందన వచ్చిందని తెలుస్తోంది. కార్తీకి తెలుగులో సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలుసు కదా.. యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ, ఖైదీ, ఖాకీ, సర్దార్ ఇలా వరుసగా సూపర్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. దీంతో ఇప్పుడు స్ట్రయిట్ తెలుగు మూవీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముంది? అనేది తెలియదు. అయితే.. ఈ సినిమాని తెలుగు నిర్మాతే నిర్మించనున్నాడని అంటున్నారు. కాగా.. విజయ్ దేవరకొండతో కాకుండా పరశురామ్ తదుపరి సినిమా విషయంలో సూర్య, దళపతి విజయ్, శింబు పేర్లు కూడా నెట్టింట చర్చల్లోకి రావడంగమనార్హం. ఇదిలా ఉండగా.. ప్రెజెంట్ తెలుగు హీరోలంతా బిజీ అవ్వడంతో తమిళ హీరోలవైపు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారని మాట్లాడుకుంటున్నారు. మరి పరశురామ్ విజయ్ తో గీతగోవిందం లైనప్ చేస్తాడా? లేక తమిళ హీరోతో కొత్త సినిమా చేస్తాడా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
తమిళ హీరోను పట్టిన @ParasuramPetla ??
— devipriya (@sairaaj44) February 5, 2023