ఒకప్పుడు వరుస హిట్లతో అగ్రనిర్మాతగా టాలీవుడ్ లో చక్రం తిప్పిన ఎంఎస్ రాజు.. ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు నిర్మించిన ఎంఎస్ రాజు గారు.. ఇప్పుడు ట్రెండ్ మార్చి దర్శకుడిగా డర్టీహరి, 7 డేస్ 6 నైట్స్ అనే సినిమాలు చేశారు. అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కించిన డర్టీ హరి మూవీ తర్వాత ఎంఎస్ రాజు.. అయన తనయుడు సుమంత్ హీరోగా 7 డేస్ 6 నైట్స్ మూవీ రూపొందించారు.
త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ఎంఎస్ రాజు. ఈ క్రమంలో తాజాగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో చర్చలకు దారితీస్తున్నాయి. మస్కా సినిమా తర్వాత ఎంఎస్ రాజు సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉండి.. దాదాపు పదేళ్ల తర్వాత డర్టీహరి సినిమాతో డైరెక్టర్ గా రీఎంట్రీ ఇచ్చారు. అయితే.. ఖలేజా సినిమా విన్నాక సినిమా చేయనన్నానని చెప్పిన ఎంఎస్ రాజు.. ఆ తర్వాత రవితేజ – గుణశేఖర్ కాంబినేషన్ లో ఓ సినిమా కూడా చేయనని చెప్పారట.
అంతేగాక మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు వారిద్దరూ వచ్చి అడిగినా నో చెప్పానంటూ ఎంఎస్ రాజు చెప్పుకొచ్చారు. ఆ టైంలో సినిమాలు చేయకూడదని అనుకున్నాను చేయలేదు. అలాగే రుద్రమదేవి సినిమాకు కూడా నో చెప్పాను. మరి ఇప్పుడున్న స్టార్స్ మహేష్, ప్రభాస్ లు డేట్స్ ఇస్తే సినిమాలు చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు.. “మహేష్, ప్రభాస్ కలిసి సినిమా చేస్తానన్నా, వాళ్ళు డేట్స్ ఇచ్చినా నేను వాళ్ళతో సినిమా చేయను” అంటూ కుండబద్దలు కొట్టేశారు. ప్రస్తుతం ఎంఎస్ రాజు మాటలు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మరి ఆయన మాటలపై ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇక దర్శకుడు ఎంఎస్ రాజు మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.