పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్.. వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉంటున్నాడు. ప్రభాస్ కు సినిమాల తర్వాత బాగా ఇష్టమైనవి ఖరీదైన కార్లని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రభాస్ గ్యారెజ్ లో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. గతేడాది ఆ కార్చ జాబితాలోకి లాంబోర్గినీ కూడా చేరిన విషయం తెలిసిందే. ఆ లాంబోర్గినీ అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్ కారు ధర దాదాపుగా రూ.6 కోట్ల వరకు ఉంటుంది. మొన్నటి వరకు ప్రాజెక్ట్-కే సెట్ కి ప్రభాస్ ఈ లాంబోర్గినీ కారులోనే వెళ్లాడు. ఇప్పుడు మారుతీ దర్శకత్వం వహిస్తున్న ‘రాజా డీలక్స్’ సినిమా షూటింగ్ కి కూడా ప్రభాస్ ఈ లాంబోర్గినీలోనే వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ కారుకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది.
అదేంటంటే.. ప్రస్తుతం రాజా డీలక్స్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని ఓ థియేటర్ సెట్ లో జరుగుతోంది. ప్రభాస్ అక్కడికి కూడా లాంబోర్గినీలోనే వెళ్తున్నాడు. ఆ ఖరీదైన లాంబోర్గినీ కారుని డైరెక్టర్ మారుతి నడుపుతూ కనిపించాడు. మారుతి కారులో కూర్చున్న ఫొటోలు, అతను డ్రైవ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కారు కేవలం 3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ వీడియో షేర్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ మారుతికి ఓ రిక్వెస్ట్ పెడుతున్నారు. ప్రభాస్ కూడా లాంబోర్గిని డ్రైవ్ చేస్తున్న వీడియో కూడా షూట్ చేసి పోస్ట్ చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
#Prabhas anna Lamborghini driving by @DirectorMaruthi 🤩👌 pic.twitter.com/RjoAFdFdrQ
— ᴠɪꜱʜᴀʟ 🏹 (@vishal_x_x_7) January 29, 2023
ఇంక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. సాహో, రాధేశ్యామ్ సినిమాల్లో సరైన హిట్టు నమోదు కాలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆదిపురుష్ మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మొత్తం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న సలార్ సినిమాపైనే తమ ఆశలు మొత్తం పెట్టుకున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. రాజా డీలక్స్ సినిమా కూడా సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత మారుతి కూడా సరైన హిట్టు కోసం వెయిట్ చేస్తున్నాడు. వీళ్లిద్దరి కాంబో మీద కూడా భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.
PAN India Star #Prabhas with his Lamborghini on the sets of #ProjectK last night. pic.twitter.com/gaZLopp9Ky
— Manobala Vijayabalan (@ManobalaV) July 20, 2022