ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చేస్తున్న నెక్స్ట్ మూవీ 'NTR30' పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతేడాది అనౌన్స్ మెంట్ అయినప్పుడే అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. తాజాగా ముహూర్తం జరుపుకుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటిదాకా చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఎన్టీఆర్30 మొత్తానికి పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల స్పీచ్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పాలి.
ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్.. చేస్తున్న నెక్స్ట్ మూవీ ‘NTR30’ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతేడాది అనౌన్స్ మెంట్ అయినప్పుడే అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. తాజాగా ముహూర్తం జరుపుకుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా.. జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. పైగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇప్పటిదాకా చాలాసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఎన్టీఆర్30 మొత్తానికి పూజా కార్యక్రమం గ్రాండ్ గా జరుపుకుంది.
దీంతో ఎట్టకేలకు ఎన్టీఆర్30 లాంచ్ అయ్యేసరికి.. నందమూరి అభిమానులు పట్టలేని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఈ మూవీ లాంచ్ కి దర్శకధీరుడు రాజమౌళి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా రావడం విశేషం. అలాగే వైట్ అండ్ వైట్ లో ఎన్టీఆర్ – మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్పెషల్ అట్రాక్షన్స్ గా నిలిచారు. ఇక ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల స్పీచ్ సినిమాపై అంచనాలు పెంచేసిందని చెప్పాలి. స్టోరీ బ్యాక్ డ్రాప్ తో పాటు కథ ఎలా ఉండబోతుందో రివీల్ చేసి సర్ప్రైజ్ చేశారు. అయితే.. సినిమా ఊహించని రేంజ్ లో ఉండబోతుందని కొరటాల మాటలు వింటే ఇట్టే అర్థమవుతుంది.
ఈ సందర్భంగా ‘ఎన్టీఆర్30’ గురించి కొరటాల మాట్లాడుతూ.. “జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ తో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కథ.. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఇందులో మనుషుల కన్నా మృగాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి భయం అంటే ఏంటో తెలీదు. దేవుడన్నా, చావన్నా భయం లేని మృగాలవి. కానీ.. వాటికి ఒకే ఒక్కటంటే భయం.. ఆ భయం ఏంటో మీకు తెలుసు. ఈ సినిమాలో లీడ్ రోల్ ఏ రేంజ్ కి వెళ్తుందో ఊహించలేరు. వెరీ ఎమోషనల్ లైన్ కూడా ఉంటుంది. ఈసారి రెట్టింపు బిగ్ రేంజ్ తో వస్తున్నాం. మీ అందరికీ నేను ప్రామిస్ చేసి చెబుతున్నా.. ఇది నా బెస్ట్ ఫిల్మ్ కాబోతుంది. అందుకు ఎన్టీఆర్ తో పాటు నా టీమ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్” అని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ సాఫ్ట్ సినిమాలతో అలరించే కొరటాల ఈసారి ప్రామిస్ చేసి మరీ చెప్పాడంటే.. ఎన్టీఆర్30 ఏ రేంజ్ లో ఉండబోతుందో ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ పెరిగిపోయింది. సో.. చూడాలి మరి ఎన్టీఆర్30తో కొరటాల బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇస్తారేమో! ఎన్టీఆర్30పై, దర్శకుడు కొరటాల మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.