మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – పూజాహెగ్డే కీలకపాత్రలు పోషించారు. ముఖ్యంగా సినిమాలో చిరంజీవి – రామ్ చరణ్ ఎపిసోడ్స్ పై ఫ్యాన్స్ రెస్పాన్స్ అదిరిపోయింది.
అలాగే ఆచార్యలో చిరు – చరణ్ ల డాన్స్, యాక్షన్ సీన్స్ చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు అంటూ పాజిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. భారీ అంచనాలతో విడుదలైన ఆచార్య ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆచార్య సినిమాకు వచ్చిన రెస్పాన్స్ పై దర్శకుడు కొరటాల శివ స్పందించారు. అయన మాట్లాడుతూ.. “ఆచార్య సినిమాను ఇంత గొప్ప హిట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మా టీమ్ అంతా 4 ఏళ్ళపాటు పడిన కష్టాన్ని మీ ఫీడ్ బ్యాక్ తో మరిచిపోయేలా చేశారు.
సినిమాలో చిరంజీవి – చరణ్ బాబు మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయని, ధర్మస్థలి సెట్ బాగుందని.. చిరు – చరణ్ ల కామెడీ ఎపిసోడ్ బాగుందని.. ఇలా ఆర్ట్ వర్క్ గొప్పగా ఉందంటూ మాకు నిన్న ,మధ్యాహ్నం నుండి కాల్స్ వస్తున్నాయి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కొరటాల మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసిన కాసేపటికే తొలగించాయి సదరు మీడియా ఛానల్స్. ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. మరి ఆచార్య మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.