సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ ని దర్శకులు కొనియాడుతూ మాట్లాడటం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా అడగ్గానే సినిమా ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెబుతుంటారు. అయితే.. ఇటీవల సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు హను రాఘవపూడి.. హీరోయిన్ రష్మిక మందాన గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాలలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ రష్మిక గురించి డైరెక్టర్ హను ఏం మాట్లాడాడు? అనే వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఆగష్టు 5న విడుదలైన సీతారామం సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీతారామం మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూ చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పిన హను రాఘవపూడి.. ఆ తర్వాత రష్మికను కొనియాడాడు.
ఇక హను మాట్లాడుతూ.. ‘గత 5వ తేది నుండి ఊహప్రపంచంలో బ్రతుకున్నట్లుగా ఉంది. ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి. నేను ఇప్పటివరకు నాలుగు సినిమాలు తీశాను. కానీ.. వాటికి ఇంత ఆదరణ లభించలేదు. నా జీవితంలో ఫస్ట్ టైం నా సినిమాకు ఇలాంటి ఆదరణ చూస్తున్నాను. సీతారామం నా మనసుకు బాగా దగ్గరైన కథ. సీతారామం కథ దృశ్య రూపంలోకి మారడానికి చాలా మంది కృషి ఉంది. తెరపై కనిపిస్తున్న రామ్ సీతతో పాటు తెరవెనుక చాలామంది పనిచేశారు.
మణిరత్నం తెరకెక్కించిన గీతాంజలి నా ఫేవరేట్ సినిమా. ఆ సినిమా నుండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ థ్యాంక్యూ మీట్ కు వచ్చిన నాగార్జునకు కృతజ్ఞతలు. నన్ను చాలా భరించిన రామ్, సీత గారికి కృతజ్ఞతలు. సీతారామం దృశ్య కావ్యంలా రావడానికి కారణం పీఎస్ వినోద్ గారు. ఆయనకి కృతజ్ఞతలు. ఇలా అందరికి పేరుపేరునా థ్యాంక్స్. ఇక అఫ్రిన్ పాత్ర చేసిన రష్మిక మందన్నకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. సీతారామం క్రెడిట్ నిర్మాత స్వప్న గారికే దక్కుతుంది.” అంటూ చెప్పుకొచ్చాడు. మరి సీతారామం మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.