దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సినిమా విడుదలై వారం రోజులు కావొస్తున్న ఇంకా వసూళ్ల పరంపర కొనసాగుతోంది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమ కథని ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడి సక్సెస్ అయ్యారు. స్టోరీ బాగుంటే.. సినిమాలు సక్సెస్ అవుతాయని మరో సారి ప్రేక్షకులు రుజువు చేశారు. సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో చిత్రం బృందం థాంక్స్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా సీతారామం సినిమా సీక్వెల్ ఉంటుందా అంటూ విలేకరులు దర్శకుడిని ప్రశ్నించారు. ఆయన సమాధానం నెట్టింట వైరలువతోంది.
సక్సెస్ మీట్‌లో ఓ విలేకరి.. ‘సీతారామం సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ కథ ఇంతటి విజయాన్ని సాధించింది కదా.. దీనికి సీక్వెల్ ఉంటుందా’ అని హను రాఘవపూడిని ప్రశ్నించాడు. దీనికి వెంటనే అక్కడే ఉన్న అశ్వినీ దత్ స్పందిస్తూ.. ఇంత మంచి కథకు సీక్వెల్ ఎందుకుండదు.. ఈ హీరోహీరోయిన్లు ఓకే అంటే వెంటనే పార్ట్-2 పట్టాలెక్కిస్తాం అన్నాడు.
ఇక దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. సీతారామం క్లైమాక్స్ చూసి చాలా మంది బాధపడ్డారు. దానికి కారణం హీరోహీరోయిన్లే. దర్శకుడు చెప్పినదాన్ని వాళ్లు సరిగా ప్రజెంట్ చేయగలిగారు కాబట్టే అంత అద్భుతంగా వచ్చింది. సినిమాకు ఆ క్లైమాక్స్ కరెక్ట్. అందుకే పార్ట్-2 లేదు. కానీ ఈ హీరోహీరోయిన్లతో మరో మంచి సినిమాతో మీ ముందుకు వస్తాము అని తెలిపారు. మొత్తానికి ఈ సినిమాకు సీక్వెల్ లేదని హను రాఘవపూడి స్పష్టం చేశారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
వైజయంతి బ్యానర్‌లో తెరకెక్కిన సీతారామం చిత్రం ఆగస్టు 5న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో రష్మిక, తరుణ్ భాస్కర్‌లతో పాటు, సుమంత్, భూమిక కీలక పాత్రల్లో నటించారు. క్లాసిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ సహా హీరో,హీరోయిన్ల కెమిస్ట్రీకి కూడా ప్రేక్షకులు నుంచి రెస్పాన్స్ వచ్చింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.