మాస్ రాజా రవితేజ సినిమాలంటే ప్రేక్షకులకు ఎంత వినోదాన్ని అందిస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ కి మాస్.. క్లాస్ కి క్లాస్ ఎలిమెంట్స్ అన్ని జోడించి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అందిస్తుంటారు దర్శకులు. అలా రవితేజతో హ్యాట్రిక్ సూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని. వీరి కాంబినేషన్ లో ఇప్పటివరకు డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు తెరపైకి వచ్చాయి.. ఒకదాన్ని మించి మరో సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే.. ముఖ్యంగా గతేడాది 50% ఆక్యుపెన్సీలో విడుదలైన క్రాక్ మూవీ.. ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. మాస్ రాజా ఫ్యాన్స్ అంతా పండగ చేసుకున్నారు.
ఇక రవితేజతో చేసిన మూడు సినిమాలలో ఆయన క్యారెక్టర్స్ ని డిఫరెంట్ గా డిజైన్ చేశాడు డైరెక్టర్ గోపీచంద్. డాన్ శీనులో ఆవారాగా.. బలుపులో రౌడీగా.. క్రాక్ లో పోలీస్ గా ఇలా అన్ని వేరియేషన్స్ చూపించేశాడు. క్రాక్ మూవీ తర్వాత వీరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అంతా కోరుకున్నారు. ఎందుకంటే.. ఇటు హీరో, అటు డైరెక్టర్ ఎవరు ప్లాప్స్ లో ఉన్నా, ఒకరికొకరు అవకాశం ఇచ్చుకుంటూ హిట్స్ కొట్టారు. వీరు కాంబోలో వచ్చిన మూడు సినిమాలు.. ఖచ్చితంగా హిట్ పడాల్సిందే అనే టైంలో వచ్చి నిలబెట్టాయి. అయితే.. క్రాక్ సినిమా ఫ్యాన్స్ కి డైరెక్టర్ గోపీచంద్ తాజాగా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పాడు.
ప్రస్తుతం గోపీచంద్ నటసింహం బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ మూవీ చేస్తున్నాడు.. ఈవైపు రవితేజ ‘ధమాకా’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 23న ధమాకా సినిమా రిలీజ్ అవుతుండగా.. రవితేజతో సినిమాలు చేసిన ముగ్గురు డైరెక్టర్స్ గోపీచంద్, బాబీ, అనిల్ రావిపూడి ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ గోపీచంద్.. రవితేజ గురించి మాట్లాడుతూ.. “రవితేజపై తన ప్రేమను సినిమాల ద్వారానే చూపిస్తానని.. నా లైఫ్ లో ఎన్ని పనులున్నా రవితేజ కోసం అన్ని పక్కన పెట్టేసి వస్తాను. మా కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు, క్రాక్ మూడు ఒకదాన్ని మించి మరోటి హిట్ కొట్టాం. నెక్స్ట్ ‘క్రాక్ 2’ కూడా వస్తుంది” అని చెప్పేశాడు. ఈ వార్త తెలిసి రవితేజ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.