సొంతూరు వదిలివెళ్లి ఎన్ని వేలకోట్ల ఆస్తులు సంపాదించినా.. పుట్టిపెరిగిన ఊరికి ఎంతో కొంత తిరిగిస్తే బాగుంటుందని చాలామంది పెద్దలు చెబుతుంటారు. చిన్నప్పుడు వినేటప్పుడు ఆ మాటల్లో అర్ధం పెద్దగా తెలియదు. పెద్దయ్యాక.. సొంతూరుకు ఏదోకటి చేయాలని, తనవంతుగా చేస్తే బాగుంటుందని టైమ్ వస్తుంది. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఒంగోలు జిల్లాలోని తన సొంతవూరుకి సాయం చేశారు.
జీవితంలో సొంతూరు వదిలివెళ్లి ఎన్ని వేలకోట్ల ఆస్తులు సంపాదించినా.. పుట్టిపెరిగిన ఊరికి ఎంతో కొంత తిరిగిస్తే బాగుంటుందని చాలామంది పెద్దలు చెబుతుంటారు. చిన్నప్పుడు వినేటప్పుడు ఆ మాటల్లో అర్ధం పెద్దగా తెలియదు. కానీ.. పెద్దయ్యాక.. బాగా సంపాదించి ఓ స్టేజ్ కి వచ్చాక.. ఖచ్చితంగా అందరూ సొంతూరుకు ఏదోకటి చేయాలని, తనవంతుగా చేస్తే బాగుంటుందని రియలైజ్ అయ్యే టైమ్ వస్తుంది. ఆ టైమ్ వచ్చినప్పుడు.. ఇవ్వడానికి కావాల్సినంత డబ్బు ఉన్నప్పుడు చేసేయాలి. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. ఒంగోలు జిల్లాలోని తన సొంతవూరుకి ఊహించని సాయం చేశారు.
క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ జాబితాలో చేరిన గోపీచంద్.. తన సొంతవూరు ఒంగోలు దగ్గరలోని బొద్దులూరివారిపాలెంలో ఉగాదిని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఊరిలో తన తాతయ్య ఉన్నం పెద సుబ్బయ్య, అమ్మమ్మ సీతమ్మ, తండ్రి మలినేని వెంకటేశ్వర్లు చౌదరిల జ్ఞాపకార్థం నిర్మించిన బస్ షెల్టర్ ను ఉగాది సందర్భంగా ప్రారంభించారు. ఈ క్రమంలో గోపీచంద్.. తన బంధుమిత్రుల సహాయంతో సొంతూరులో బస్ షెల్టర్ నిర్మించానని.. రాబోవు కాలంలో మరిన్ని సౌకర్యాలు ఊరికి సమకూర్చుతానని హామీ ఇచ్చారు. అలాగే ఇండస్ట్రీలో సక్సెస్ వచ్చినప్పుడు చేసుకునే సెలబ్రేషన్స్ కంటే.. సొంతూరులో కొద్దిరోజులు గడిపితే వచ్చే ఆనందం వేరుగా ఉంటుందని చెప్పారు.
ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. “నేను పుట్టిన బొద్దులూరివారిపాలెంలో ఈ ఉగాదిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా ఊరికి ఎప్పుడొచ్చినా మంచి బస్ షెల్టర్ ఉంటే బాగుంటుందని అనుకునేవాడిని. ఇప్పుడది సాధ్యమైంది. దీనికోసం నా ఫ్రెండ్స్ అందరూ సహకరించారు. ఇది నా ఊరికి నేను చేసిన చిన్న సాయం మాత్రమే. ఈ ఊరికి చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి పుట్టిన ఊరికి ఒక్కొక్కటిగా చేస్తాం. ఈ ఊరిలో నాకు అందరూ బంధువులే. నేను సినిమా సినిమాకి గ్యాప్ లో ఊరు వచ్చి వెళ్తున్నాను. అప్పటికీ, ఇప్పటికీ ఊర్లో చాలా మార్పులొచ్చాయి.” అని చెప్పుకొచ్చారు. అనంతరం.. తన కొత్త సినిమా కూడా మైత్రి మూవీస్ బ్యానర్ లోనే ఉంటుందని.. త్వరలోనే అనౌన్స్ మెంట్ ఉంటుందని అన్నారు. ఇక సొంతూరుకు బస్ షెల్టర్ ఏర్పాటు చేసినందుకు గోపీచంద్ ని ఊరు జనంతో పాటు, సోషల్ మీడియాలో నెటిజన్స్, ఫ్యాన్స్ అభినందిస్తున్నారు. మరి సొంతూరుకి బస్ షెల్టర్ కట్టించిన దర్శకుడు గోపీచంద్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.