యాంకర్ అనసూయ.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, చలాకీతనంతో పాటు.. నటన కలబోస్తే అనసూయ. ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ జబర్దస్త్ వీక్షకులను కనువిందు చేయడం అనసూయ నైజం. ప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా ఆమె సత్తా చాటుతోంది. పలు సూపర్ హిట్ సినిమాల్లో భాగమవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ఆ తర్వాత ”క్షణం, రంగస్థలం, యాత్ర, కథనం, థ్యాంక్యూ బ్రదర్, ఖిలాడీ, పుష్ప” సహా పలు సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇక ప్రస్తుతం రంగమార్తాండ, వేదాంతం రాఘవయ్య, గాడ్ ఫాదర్, హరిహర వీరమల్లు, పుష్ప 2, భోళా శంకర్ వంటి భారీ సినిమాలు అనసూయ చేతిలో ఉన్నాయి.
ఇటు బుల్లితెర, అటు బిగ్ స్క్రీన్ మీద వరుస షోలు, సినిమాలు చేస్తూ.. ఎంత బిజీగా ఉన్నప్పటికి.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది అనసూయ. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్‌ని అప్‌లోడ్ చేస్తూ ఉంటుంది. గ్లామర్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. ఇక డ్రెస్సింగ్ విషయంలో అనసూయ మీద వచ్చినన్ని విమర్శలు మరే యాంకర్ మీద రావు. ఆమె డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోల్ చేస్తారు నెటిజనులు. ఇక ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా తన ఫ్యాషన్ ట్రెండ్ అస్సలు మార్చుకోదు అనసూయ. అంతేకాదు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌పై ఓ దర్శకుడు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: SP Charan: స్టార్ హీరోయిన్‌తో SP. బాలు కుమారుడు చరణ్
తెలుగులో రెండు మూడు సినిమాలు చేసిన దర్శకుడు గీతా కృష్ణ ఈ మధ్యకాలంలో పలు ఇంటర్వూస్ ఇస్తూ సినీ ప్రముఖులపై కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అనసూయ గురించి ఆయన మాట్లాడారు. నాగార్జున హీరోగా రూపొందిన సంకీర్తన అనే సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన గీతా కృష్ణ.. ఆ తర్వాత కీచురాళ్లు, కోకిల వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే అవేవీ పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో తమిళ సినీ పరిశ్రమకు వెళ్లి అక్కడ రెండు సినిమాలు రూపొందించారు. ఈ క్రమంలో ప్రస్తుతం సినీ సెలబ్రిటీలపై ఆయన చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Vagdevi: తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవి హీరోయిన్ కాబోతుందా?
తాజాగా అనసూయ డ్రెస్సింగ్ సెన్స్‌పై గీతా కృష్ణ కొన్ని కామెంట్స్ చేశారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్ తనకు చాలా ఇష్టమంటూ ఓపెన్ అయ్యారు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ చాలా అద్భుతంగా నటించిందని చెప్పిన ఆయన.. పుష్ప సినిమాలో దాక్షాయణిగా అనసూయను గుర్తుపట్టలేకపోయానని చెప్పారు. అనసూయ నటనను చూసి కొందరు అసూయ పడుతూ ఆమెను ట్రోల్ చేస్తుంటారు. ఆమె ఫ్యాషన్ సెన్స్ చాలా కొత్తగా ఉంటుంది. ట్రెండీగా ఉండే అనసూయ డ్రెస్సింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదే చాలా మందికి నచ్చక, ఇష్టం లేక ట్రోల్స్ చేస్తుంటారు అని గీతా కృష్ణ అన్నారు. అంతేకాక ఆమెను అలా చూడ్డానికే చాలా మంది ఇష్టపడతారని అన్నారు. ప్రస్తుతం గీతా కృష్ణా కామెంట్స్ వైరలవుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Pelli SandaD Movie OTT : పెళ్లి సందD ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! ఎప్పటి నుండంటే?