ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇచ్చే అవకాశాలను కొంతమంది దర్శకులే సంపూర్ణంగా ఉపయోగించుకోగలుగుతారు. చాలామంది స్టార్ హీరోల సినిమా ఛాన్స్ వచ్చిందనే ఆలోచనలో ఎక్కడో చోట తడబడి నిరాశపరుస్తుంటారు. కానీ.. కొంతమంది దర్శకులు అవకాశం కోసం ఎదురు చూస్తారు.. రాగానే సాలిడ్ హిట్ కొట్టి ప్రూవ్ చేసుకుంటారు. పేరు, నమ్మకం నిలబెట్టుకుంటారు. టాలీవుడ్ లో ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి.. ఒక మెగా అభిమానిగా.. మెగా ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసుకునేలా చేశాడు దర్శకుడు బాబీ. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. వింటేజ్ చిరుని చూపించి సూపర్ హిట్ ఇచ్చాడు బాబీ.
భారీ అంచనాల మధ్య ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య.. వారంలోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసి.. ఊహించని లాభాలను తెచ్చిపెట్టింది. వరల్డ్ వైడ్ రూ. 89 కోట్ల బిజినెస్ చేసిన వీరయ్య.. దాదాపు రూ. 140 కోట్లకు పైగా షేర్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం వీరయ్య మూవీ టీమ్ అందరూ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు బాబీ తాజాగా సక్సెస్ ని ఆస్వాదిస్తూ హైదరాబాద్ నుండి చిన్నతిరుపతి దేవాలయానికి వెళ్ళాడు. కాగా.. గన్నవరంలో మెగా అభిమానులు ఎదురై బాబీని ఘనస్వాగతం పలికారు. అలాగే మెగా హిట్ ఇచ్చినందుకు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. బాబీతో ఫోటోలు దిగారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్ కి ఓ క్రేజీ న్యూస్ అనౌన్స్ చేశాడు. వాల్తేరు వీరయ్య మూవీని పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపిన బాబీ.. చిరంజీవి అవకాశం ఇవ్వడమే పెద్ద గిఫ్ట్ అని చెప్పాడు. అలాగే త్వరలోనే మెగా హీరోతో కొత్త మూవీ అనౌన్స్ మెంట్ ఉంటుందని అన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతూనే.. బాబీ చెప్పిన మెగా హీరో ఎవరా? అని ఆలోచనలో పడ్డారు. అయితే.. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. బాబీ తదుపరి సినిమా రామ్ చరణ్ తో ఉండబోతుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది. సో.. మెగా ఫ్యాన్ అయిన బాబీ నుండి త్వరలోనే మరో మెగా మూవీ అనౌన్స్ మెంట్ రానుందన్నమాట! మరి వాల్తేరు వీరయ్య హిట్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.