దేశంలో ఏదైన ఉద్యమానికి మద్ధతు తెలుపుతూ.. లేదా ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాటం చేసిన వారికి దుండగుల నుంచి చంపేస్తామని, అత్యాచారం చేస్తామని బెదిరింపులు రావడం సహజమే. ఇలాంటి బెదిరింపులే తన కూతురికి వచ్చాయని స్టార్ డైరెక్టర్ సంచలన నిజాలను తాజాగా బయటపెట్టాడు. పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా 2019లో ఈ చట్టానికి వ్యతిరేఖంగా నా కూతురు ఉద్యమంలో పాల్గొనటంతో ఆమెకు బెదిరింపులు వచ్చాయని డైరెక్టర్ తెలిపాడు. అప్పటి నుంచి తను డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని.. దాంతో నాకు గుండెపోటు కూడా వచ్చిందని స్టార్ డైరెక్టర్ పేర్కొన్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
పౌరసత్వ సవరణ చట్టం-2019.. అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. ఈ చట్టంలో భాగంగా.. భారతదేశంలోకి 2014 ముందు వరకు అక్రమంగా బౌద్దులు, ముస్లీములు, హిందువులు, క్రైస్తవులు, పార్శీలు మెుదలైన విదేశీయులు చొరబడ్డారు. అలాంటి వారిని ఏరివేయడానికే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు తన కూతుర్ని రేప్ చేసి చంపేస్తామని బెదిరించినట్లు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ చెప్పుకొచ్చాడు. తాజాగా ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఇందుకు సంబంధించి పలు సంచలన విషయాలు వెల్లడించాడు.
“పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేఖంగా పొరాటం చేసినందుకు నా కూతురిని చాలా మంది ద్వేషించారు. అదీకాక అత్యాచారం చేసి చంపుతామని బెదిరింపులకు గురిచేశారు. దాంతో నా కూతురు ఆలియా భయానికి గురై.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆమె బాధను చూడలేక నాకు గతేడాది హార్ట్ ఎటాక్ వచ్చింది” అని అనురాగ్ కశ్యప్ అన్నారు. ఆ సమయంలో నేను నా ట్విట్టర్ ఖాతాను సైతం తొలగించి 2019లో పోర్చుగల్ వెళ్లామని అనురాగ్ పేర్కొన్నాడు. అయితే నేను నా కూతుర్ని చూసి గర్వపడుతున్నాను. ఆమె దైర్యానికి, తెగువకు నేను ఆశ్చర్యపోయాను. ఇన్ని బెదిరింపులు వచ్చినప్పటికీ తను చేసే పనిని ఏ మాత్రం వదిలిపెట్టలేదు. తన కెరీర్ పై మరింతగా దృష్టి పెట్టిందని అనురాగ్ కశ్యప్ పేర్కొనాడు. ఈ క్రమంలోనే నేను మళ్లీ ప్యార్ విత్ డిజే మెుహబ్బత్ సినిమా కోసం తిరిగి ఇండియాకు వచ్చానని కశ్యప్ వెల్లడించాడు. ఇతరులలా నాకు కూర్చుని అనుభవించే లగ్జరీ లైఫ్ లేదని అతడు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.