సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లపై దర్శకులు ప్రశంసలు కురిపించడం, కామెంట్స్ చేయడం అనేది సర్వసాధారణమే. అది సినిమా విషయంలో లేదా యాక్టింగ్ విషయంలో అయితే బాగానే ఉంటుంది. కానీ.. కొన్నిసార్లు హీరోయిన్స్ పై చేసే కామెంట్స్ హద్దులు దాటడమే కాకుండా వివాదాలకు దారితీస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరోయిన్ తాప్సిపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ చేసిన కామెంట్స్ వివాదానికి తెరలేపాయి.
వివరాల్లోకి వెళ్తే.. తాప్సీ ఇటీవల ‘దొబారా’ అనే సినిమా చేసింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా తాప్సి, డైరెక్టర్ తో కలిసి ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇక యాంకర్ మాట్లాడుతూ.. రణ్‌వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్‌పై మీ అభిప్రాయం ఏంటని అనురాగ్ కశ్యప్‌ను ప్రశ్నించాడు.
డైరెక్టర్ స్పందిస్తూ.. రన్వీర్ ఫోటోషూట్ తనకు నచ్చిందని, ప్రస్తుతం ఇలాంటివి సర్వసాధారణమని చెప్పాడు. అయితే.. మీరు కూడా ట్రై చేయండి.. ఆ ఫొటోషూట్ బాగా వైరల్ అవుతుందని యాంకర్ సరదాగా అన్నాడు. దీంతో తాప్సీ మధ్యలో కల్పించుకొని.. ‘ప్లీజ్ హారర్ షోకు తెరలేపకండి’ అని కామెంట్ చేసింది. వెంటనే అనురాగ్ కశ్యప్.. “నువ్వెందుకు భయపడుతున్నావ్.. హో తనకంటే నా బూ** పెద్దగా ఉంటాయని అసూయ” అని కామెంట్స్ చేశాడు.
అనురాగ్ కామెంట్ కి ఇబ్బంది పడిన తాప్సి.. ఆ తర్వాత చిన్నగా నవ్వి ఊరుకుంది. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హీరోయిన్ పై అలాంటి బూతు కామెంట్స్ ఏంటని అనురాగ్ పై నెటిజెన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. అలాగే తాప్సి కూడా అలా సైలెంట్ గా ఉండటాన్ని తప్పు బడుతున్నారు. మరి తాప్సి పై దర్శకుడు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Torch bearer of woke movement #AnuragKashyap is comparing a women’s bosom with his chest, and Instead of slapping AK this women is laughing , hail wokes 🙏
— Good Guy (dard/dukh) (@gooljaar) August 17, 2022