ఈ మధ్య కాలంలో కామెడీ షోల హవా ఎక్కువయిపోయింది. ప్రతీ ఛానల్‌నూ ఓ కామెడీ షో పుట్టుకొస్తోంది. ఆఖరికి కొన్ని ఓటీటీలు కూడా కామెడీ షోలకు జై కొడుతున్నాయి. జనాల్ని ఆకర్షించడానికి దీన్నో మంచి మార్గంగా ఎంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కూడా ప్రస్తుత ట్రెండ్‌ను ఫాలో అయిపోయింది. ‘‘కామెడీ స్టాక్ ఎక్సైంజ్’’ పేరిట ఓ కామెడీ షోకు శ్రీకారం చుట్టింది. ఇందులో ప్రముఖ బుల్లితెర కమెడియన్స్ కంటెస్టెంట్లుగా ఉన్నారు. ఈ షోలో ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి నిలిచారు. ఈ షోకు ఆయనే జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి యాంకర్స్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది.
ఈ షో ఎంత కామెడీగా ఉండబోతోందో అన్నది ఈ ప్రోమోను చూస్తే అర్థమైపోతోంది. కంటెస్టెంట్లు మొత్తం ఎంతో అద్భుతంగా కామెడీ చేశారు. ముఖ్యంగా సద్ధాం, ముక్కు అవినాష్ కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు! ఈ షో జడ్జి అనిల్ రావిపూడి, యాంకర్ దీపిక పిల్లిని ముద్దు పెట్టుకోవటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముద్దులు పెట్టుకునే టాస్క్‌లో భాగంగా అనిల్ రావిపూడి, దీపికను ముద్దు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై పెద్దగా క్లారిటీ లేదు. మరి, అనిల్ రావిపూడి, దీపికను ఎందుకు ముద్దు పెట్టుకున్నాడో తెలియాలంటే ఎపిసోడ్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
కాగా, అనిల్ రావిపూడి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తీయబోతున్నారు. ఈ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదు. బాలకృష్ణ 108గా తెరపైకి వెళుతోంది. ఇక, ఈ సినిమాను అనిల్ రావిపూడి ప్రతిష్టాత్మకంగా తీయనున్నట్లు తెలుస్తోంది. ముందెన్నడూ చూడని విధంగా మరో లెవల్ మాస్ పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్నారంట. అఖండ సినిమాకు సంగీతం అందించి ఓ ఊపు ఊపిన థమన్ ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. మరి, వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఎన్బీకే 108 ఎన్ని రికార్డులు సృష్టించబోతోందో వేచి చూడాల్సిందే.