తమిళంలో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి అనుకోకుండా యాక్టర్ గా మారిన క్రమంగా ఖాళీ సమయమే లేని బిజీ ఆర్టిస్టుగా మారిపోయాడు సముద్రఖని. తమిళ సినిమా అయిన నాడోడిగల్ ని తెలుగులో శంభో శివ శంభో పేరుతో రీమేక్ చేసి దర్శకత్వం వహించాడు సముద్రఖని. తన సినిమాల్లోనే క్యామియో తరహా రోల్స్‌తో ఆకట్టుకున్న సముద్రఖని తర్వాత పూర్తిస్థాయి నటుడిగా మారాడు విచారణ సినిమాలో ఆయన చేసిన పోలీస్ అధికారి పాత్రకు జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు కూడా వచ్చింది. తెలుగులో అల వైకుంఠపురములో, క్రాక్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇవి రెండూ మంచి హిట్లుగా నిలిచి సముద్రఖనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
క్రాక్ సినిమాలో సముద్రఖని నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ పాత్రలో అయన తప్ప మరొకరిని ప్రస్తుతం ఊహించాను కూడా ఊహించలేం. దర్శకుడిగా చాలా విజయాలు అయన ఖాతాలో ఉన్నాయి. తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటించనున్నారని అంటున్నారు. ‘లూసిఫర్’ ఒరిజినల్లో వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్ర చేశాడు. సముద్రఖని అలాంటి పాత్రలో ఎలా ఉంటారా అన్న ఆసక్తి నెలకొంది. అయితే రీమేక్ కోసం ఆయన పాత్రను మార్చే అవకాశం లేకపోలేదు అని కొందరు అంటున్నారు. ఆర్ఆర్ఆర్, సర్కారు వారి పాట సినిమాల్లో కూడా సముద్రఖని ఛాన్స్ కొట్టేశాడు.
రానా సోదరుడు అభిరామ్ హీరోగా దర్శకుడు తేజ ఒక సినిమాను రూపొంది స్తున్నాడు. ఇందులో ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనకు భారీ రెమ్యునరేషన్ కూడా ఇచ్చేందుకు సిద్ద మవుతున్నారట. ఆ పాత్రను ఆయన చేయడం వలన వచ్చే రెస్పాన్స్ వేరేగా ఉంటుందంటూ సురేశ్ బాబును ఒప్పించే ప్రయత్నంలో తేజ ఉన్నాడని అంటున్నారు.
సముద్రఖనికి గల డిమాండ్ కారణంగా ఆయన పారితోషికం ఒక రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. అయితే అభిరామ్ కి ఇది తొలి సినిమా కనుక తేజ నిర్ణయానికి సురేశ్ బాబు ఓకే చెప్పొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.