గత కొంత కాలంగా ఇండస్ట్రీలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడు అని. తాజాగా ఈ వార్తలపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు మురుగదాస్.
సాధారణంగా ఇండస్ట్రీలో కాంబినేషన్లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. అందులో బోయపాటి శ్రీను-బాలయ్య, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ఇలా మరికొన్ని కాంబినేషన్ల కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు కాంబినేషన్ పడని స్టార్ డైరెక్టర్ తో.. స్టార్ హీరో సినిమా చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీలో చాలా వార్తలు చెక్కర్లు కొడుతుంటాయి. గత కొంత కాలంగా ఇండస్ట్రీలో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే? తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడు అని. తాజాగా ఈ వార్తలపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు మురుగదాస్.
మురుగదాస్.. భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ మురుగదాస్. తన సినిమాలో కమర్షియల్ హంగులతో పాటుగా సమాజాన్ని ఆలోచింపజేసే అంశాలను కూడా మేళవింపజేస్తాడు. అయితే గత కొంత కాలంగా మురుగదాస్ సినిమాలు తియ్యడం లేదు. చివరిగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో తీసిన ‘దర్భార్’ మూవీనే అతడి చివరి సినిమా. తాజాగా అతడు నిర్మించిన ’16 ఆగస్టు 1947′ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మురుగదాస్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. అల్లు అర్జున్ తో మీరు సినిమా చేస్తున్నారా? అని విలేకరి ప్రశ్నించగా.. మురుగదాస్ క్లారిటీ ఇచ్చారు.
మురుగదాస్ మాట్లాడుతూ..”ఒక డైరెక్టర్ అనేక మంది హీరోల దగ్గరకు వెళ్తాడు. అలాగే ఓ హీరో అనేక మంది దర్శకుల దగ్గరకు వెళ్తాడు. అయితే ఏదో ఒక సమయంలో వారి ప్రాజెక్ట్ మెుదలు అవుతుంది. ప్రస్తుతం మా ప్రాజెక్ట్ తొలి దశలోనే ఉంది. ఇంతకు మించి నేను ఏం చెప్పినా అదే రేపటి న్యూస్ లో హెడ్డింగ్ పెట్టి రాస్తారు” అంటూ చమత్కరించాడు. దీనిని బట్టి చూస్తే.. అల్లు అర్జున్ తో మురుగదాస్ కాంబినేషన్ పక్కా అంటున్నారు అభిమానులు. మరి మురుగదాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ చేస్తే ఎలా ఉంటుందో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.