టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో డింపుల్ హయతి ఒకరు. యూత్ ఆడియెన్స్‌లో ఆమెకు ఫుల్ క్రేజ్ ఉంది. అలాంటి డింపుల్ హయతి ఒక రిపోర్టర్ మీద అసహనం వ్యక్తం చేశారు.
డింపుల్ హయతి.. యువ ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు. కిర్రెక్కించే అందచందాలతో యూత్ ఆడియెన్స్‌ను తన వైపు తిప్పుకోవడంలో ఈ బ్యూటీ బాగా సక్సెస్ అయ్యారు. మాస్ మహారాజా రవితేజ సరసన నటించిన ‘ఖిలాడీ’ చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించారు డింపుల్. ఈ సినిమాలో అందంతో పాటు అభినయంతోనూ నటిగా తానేంటో ఆమె నిరూపించుకున్నారు. ‘ఖిలాడీ’లో ఆమె గ్లామర్ ట్రీట్‌కు ఎక్కువ మంది ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం యాక్షన్ స్టార్ గోపీచంద్ సరసన ‘రామబాణం’ ఫిల్మ్‌లో నటిస్తున్నారు డింపుల్. ఈ మూవీ మే 5వ తేదీన విడుదల కాబోతోంది. రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్‌లో వేగం పెంచింది ‘రామబాణం’ మూవీ టీమ్.
ముఖ్యంగా హీరో గోపీచంద్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారారు. ప్రముఖ యాంకర్ సుమ నిర్వహించే ‘సుమ అడ్డా’ షోలోనూ ‘రామబాణం’ చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ తేజతో గోపీచంద్ మరో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ‘సుమ అడ్డా’ ప్రోమో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. అందులో సుమ మెడను గోపీచంద్ పట్టుకోవడంతో అసలు ఏం జరిగిందనేది తెలుసుకోవానే ఆసక్తి అందరిలో కలిగింది. ఇక, సినిమా ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచిన ‘రామబాణం’ టీమ్.. ఇవాళ ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో హీరో గోపీచంద్‌తో పాటు హీరోయిన్ డింపుల్ హయతి, డైరెక్టర్ శ్రీవాస్, మిగిలిన చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఒక రిపోర్టర్ మీద డింపుల్ హయతి అసహనం వ్యక్తం చేశారు.
ప్రెస్ మీట్లో ‘రామబాణం’ చిత్ర విశేషాలను పంచుకున్నారు మూవీ యూనిట్. అయితే ఒక రిపోర్టర్ ‘ఈమధ్య దర్శకులు చాలా మంది హీరోయిన్ల క్యారెక్టర్లను డిఫరెంట్‌గా క్రియేట్ చేస్తున్నారు. కొత్త జానర్లో చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మూవీలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్‌గా, రొమాంటిక్‌గా ఉన్నట్లు అనిపిస్తోంది’ అని డింపుల్ హయతిని అడిగారు. వల్గర్ పదం విన్న వెంటనే అసహనానికి గురైన హీరోయిన్.. వల్గర్ అంటారేంటని ఎదురు ప్రశ్నించారు. సినిమాలో ఎక్కడా అలాంటి సీన్స్ లేవని.. గ్లింప్స్ కూడా అలాంటివి వదల్లేదన్నారు. సినిమా పాటల్లో, పోస్టర్లలో తాను శుభ్రంగా ఉన్నానని.. వల్గర్ అంటుంటే తనకు ఏమీ అర్థం కావడం లేదని నవ్వుతూనే అసహనాన్ని వ్యక్తం చేశారు డింపుల్. వెంటనే దర్శకుడు శ్రీవాస్ కలుగజేసుకున్నారు. ఇదొక ట్రెడిషనల్ సినిమా అని చెప్పారు.
ఈ మూవీలో నేనేం వల్గర్‌గా లేను | #dimplehayati | #ramabanam | #reels | News18 Telugu#dimpleHayati #ramabanam #reels #gopichand #news18telugu pic.twitter.com/tUQyVQq4jy
— News18 Telugu (@News18Telugu) April 26, 2023