డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా డింపుల్ హయాతికి సంబంధించి ఓ సీక్రెట్ వెలుగులోకి వచ్చింది. ఆ వివారలు..
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నటి డింపుల్ హయాతి పేరు మారుమోగిపోతుంది. ట్రాఫిక్ డీసీసీ రాహుల్ హెగ్డేకి, డింపుల్ హయాతి మధ్య నడిచిన వివాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. డిపుల్ హయాతి.. ఐపీఎస్ అధికారి వాహనాన్ని కాలితో తన్నడమే కాక.. తన బెంజ్ కారుతో రివర్స్‌లో వచ్చి ఐపీఎస్ అధికారి కారును ఢీకొట్టింది. ఈ క్రమంలో ఐపీఎస్ అధికారి డ్రైవర్‌కు, డింపుల్ హయాతికి మధ్య వివాదం చోటు చేసుకుని అది కాస్త తీవ్రంగా మారడంతో.. ఆమె మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే డీసీపీ కావాలనే డింపుల్ హయాతిని ఇబ్బంది పెట్టడానికే ఆమె పార్కింగ్ ప్లేస్‌లో కోన్స్ పెట్టారని.. నటి తరపు లాయర్ వెల్లడించారు. ఈ వివాదానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
డీసీపీతో వివాదం కారణంగా.. డింపుల్ హయాతికి సంబంధించిన ఓ సీక్రెట్ వెలుగులోకి వచ్చిందని.. అప్పటి నుంచి ఆమె ఇల్లు దాటి బయటకు రావడం లేదని సమాచారం. ఇంతకా సీక్రెట్ ఏంటి అంటే.. ఈ వివాదం కారణంగా డింపుల్ హయాతి బాయ్ ఫ్రెండ్ గురించి వెలుగులోకి వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వివాదం చోటు చేసుకున్న అదే అపార్ట్‌మెంట్‌లో డింపుల్ హయాతి.. తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తుంది. ఈ గొడవ కారణంగా అతడి గురించి, తమ రిలేషన్ గురించి బయటకు తెలియడం పట్ల డింపుల్ అసహనంగా ఉన్నారని సమాచారం.
ఇంతకు డింపుల్ బాయ్‌ఫ్రెండ్ ఎవరు.. అంటే.. అతడి పేరు విక్టర్ డేవిడ్. గత కొంత కాలంగా వీరద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయతే ఇప్పటి వరకు వీరి రిలేషన్ గురించి ఎక్కడా ఒక్క వార్త కూడా రాలేదు. అంత గోప్యంగా ఉంచారు. కానీ డీసీపీతో గొడవ తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విక్టర్ డేవిడ్‌గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేస్తున్నాడని తెలుస్తోంది. ఇక డింపుల్ హయాతి, విక్టర్ డేవిడ్.. ఇద్దరి స్వస్థలం విజయవాడ అని వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని.. సహజీవనం చేస్తున్నారు. కానీ డీసీపీతో గొడవ కారణంగా ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.