సాధారణంగా సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రోజూ ఏదొక వార్త వింటూనే ఉన్నాం. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న అమ్మాయిల నుండి స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న బ్యూటీల వరకు కెరీర్ లో అందరూ స్ట్రగుల్ అయినవారే. అయితే.. ఎక్కువగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం చూస్తున్నాం. కానీ.. సినిమాలలో మహిళల క్యారెక్టర్స్ గురించి హీరోయిన్స్ పెద్దగా స్పందించడం తక్కువ. మంచి క్యారెక్టర్స్ వస్తేనే సినిమాలు చేద్దాం అనుకునే హీరోయిన్స్ ఓ రకమైతే.. టైమ్ వేస్ట్ చేయకుండా వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ పోదాం అనుకునేవారు మరోరకం.
అదీగాక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే.. ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఎక్కువకాలం కొనసాగడం కష్టమే. ఎప్పటికప్పుడు పాతనీరు పోయి కొత్తనీరు వస్తూనే ఉంటుంది అన్నట్లుగా.. సినిమా హిట్ అయితే మరో ఛాన్స్, ఫట్ అయితే అదే లాస్ట్ అనే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ కే పరిమితమైన తెలుగు హీరోయిన్ డింపుల్ హయతి.. తాజాగా సినిమాలలో అమ్మాయిలు, మహిళల క్యారెక్టర్స్ పట్ల తన అభిప్రాయాలను బయట పెట్టినట్లు తెలుస్తోంది. గల్ఫ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన డింపుల్.. గడ్డలకొండ గణేష్ సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ ద్వారా పాపులర్ అయ్యింది.
అదే క్రేజ్ తో రవితేజ సరసన ఖిలాడీ, విశాల్ సరసన సామాన్యుడు సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. దీంతో ప్రస్తుతం అవకాశాలు లేక సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటోంది డింపుల్. ఇదిలా ఉండగా సినిమాలలో ఫిమేల్ రోల్స్ గురించి మాట్లాడుతూ.. “సమాజంతో పాటు సినిమాలలో కూడా అదే జరుగుతోంది. లోకమంతా స్త్రీలు, పురుషుల చుట్టూనే తిరుగుతోంది. మహిళల పాత్రలు సమాజంలో ఉన్నట్లే, సినిమాల్లోను ప్రభావితం చేస్తుంటాయి. అందుకే అమ్మాయిల కోసం మగాళ్లు పడే పాట్లను సహజంగా చూపిస్తుంటారు.
ఈ విషయంలో దర్శకనిర్మాతల పద్ధతి మారాలి. సినిమాలలో మగాళ్ల ప్రేమను హైలెట్ చేస్తూ.. మహిళల పాత్రలను బలంగా రాయట్లేదు. ముఖ్యంగా ప్రేమను చూపించడంలో ఆడాళ్ళు తక్కువ కాదని చూపించాలి. అలాంటి స్ట్రాంగ్ రోల్స్ సినిమాల్లో కనిపించడం లేదు. అలాగని రియల్ లైఫ్ లో ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ ని తెరపై కూడా చూపించట్లేదు. మహిళల పాత్రలలో నేచురాలిటీని, ప్రేమను మరింత వినూత్నంగా ఎఫెక్టీవ్ గా చూపించే కథలను దర్శకులు, నిర్మాతలు ప్రోత్సహిస్తే బాగుంటుంది” అని చెప్పికొచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం డింపుల్ మాటలు నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ గోపీచంద్ సరసన శ్రీవాసు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తుందని టాక్.